సుశాంత్‌కు చివరి వీడ్కోలు చెప్పిన ఫ్యామిలీ.. సంచలన నిర్ణయం ప్రకటిస్తూ లేఖ

సుశాంత్ సింగ్ మరణం ఎందరికో శోకాన్ని మిగిల్చింది. కేవలం కుటుంబ సభ్యులనే కాదు కొన్ని కోట్ల హృదయాలను గాయపర్చింది. ఎంతో మంచి మనసు, ఎంతో ప్రతిభ ఇంకెంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిప్రెషన్ కారణంగానే ఉరి వేసుకున్నాడని ప్రాథమికంగా నిర్దారించారు.అయితే సోషల్ మీడియాలో సుశాంత్ మృతి పట్ల నేటికీ ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.

 ఎంతో గర్వకారణం..

ఎంతో గర్వకారణం..

సుశాంత్ ఫ్యామిలీ లేఖ సారాశం.. ‘సుశాంత్ ఆత్మ ఎంతో స్వేచ్చగా తిరిగేది. అనర్గళంగా మాట్లాడేవాడు. నమ్మశక్యం గాని ప్రతిభ అతని సొంతం. ప్రతీ ఒక్క విషయం పట్ల ఎంతో ఆసక్తిని కనబర్చేవాడు. నిర్విరామంగా కలలు కంటూ ఉండేవాడు. ఓ సింహం మాదిరి తన కలలను వెంటాడే వాడు. ఎంతో చక్కగా నవ్వుతూ ఉండేవాడు. మా కుటుంబానికి సుశాంత్ గర్వకారణం. ఎంతో ఇష్టమైన చుక్కలనే చూసే టెలిస్కోప్ అతనికి వెలకట్టలేని బహుమతి.

ఇక చూడలేం..

ఇక చూడలేం..

అతని నవ్వులను తిరిగి చూడలేమనే సత్యాన్ని మేము అంగీకరించలేకపోతున్నాము. మెరిసే అతని కళ్లను ఇక మేము చూడలేం. సైన్స్ గురించి చెప్పే అతని మాటలను మేము ఎప్పటికి వినలేం. అతని మరణం మాకు శాశ్వత శూన్యాన్ని మిగిల్చింది. అది ఎప్పటికీ భర్తీ చేయలేనిది.

 యంగ్ టాలెంట్ కోసం ఫౌండేషన్

యంగ్ టాలెంట్ కోసం ఫౌండేషన్

అతను తన అభిమానులను సంతోషపరిచేందుకు ప్రయత్నించేవాడు. సుశాంత్‌పై ఎంతో ప్రేమను కురిపించిన మీ అందరికీ ధన్యవాదాలు. సుశాంత్‌ గౌరవార్థం, అతని లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు గానూ.. నిమా, సైన్స్, స్పోర్ట్స్ ఇలా అన్ని విభాగాల్లో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్‌ను స్థాపించాలని మా కుటుంబ సభ్యులందరం నిర్ణయించుకున్నాం.

 సుశాంత్ మెమోరియల్..

సుశాంత్ మెమోరియల్..

రాజీవ్ నగర్, పాట్నాలోని సుశాంత్ నివసించిన ఇంటిని ఇకపై మెమోరియల్‌గా మార్చబోతోన్నాం. సుశాంత్ వస్తువులను అందులో ఉంచుతాం. అందులో భాగంగా అతడిని ఆరాధించే వారికోసం, అభిమానుల కోసం కొన్ని వేల పుస్తకాలు, అతని టెలిస్కోప్, ఫ్లైట్ స్టిమ్యులేటర్ వంటి వాటిని భద్రపరుస్తాం.

 సుశాంత్ జ్ఞాపకార్థం..

సుశాంత్ జ్ఞాపకార్థం..

ఇక ఈ క్షణం నుంచి అతని ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్‌లను అతని జ్ఞాపకార్థం మేమే హ్యాండిల్ చేస్తాం. సుశాంత్ జ్ఞాపకాలు నిత్యం ఉండేలా వాటిని మేము నిర్వహిస్తాము. మరొక్క సారి మీ అందరికీ ధన్యవాదాలు' అని సుశాంత్ ఫ్యామిలీ అందర్నీ కంటతడి పెట్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X