మరణానికి ముందు సుశాంత్ ఇంట్లో మరో వ్యక్తి.. దీపేశ్ అదృశ్యంపై సందేహాలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆ రాత్రి ఇంట్లో జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే సుశాంత్ మరణం రోజున పలువురు మిత్రులతోపాటు దీపేశ్ అనే వ్యక్తి కూడా ఇంట్లో ఉన్నారనే విషయం తాజాగా బయటకు వచ్చింది. అయితే దీపేశ్ ఆచూకీ తెలియకపోవడం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
Recommended Video

భిన్న రకాల వాదనలు
సుశాంత్ మరణానికి ముందు ఇంట్లో ఎవరెవరూ ఉన్నారనే విషయంపై క్లారిటీ లభించడం లేదు. పని మనుషులు, ఇతర మేనేజర్లు తలోరకంగా తమ వెర్షన్లను వినిపిస్తున్నారు. అయితే తాజాగా ఇంటి సిబ్బంది తెలిపిన ప్రకారం.. దీపేశ్ అనే వ్యక్తి సుశాంత్‌తొ కలిసి ఉన్నారు అని వెల్లడించారు.

పితాని, సందీప్ సింగ్ పొంతనలేని సమాధానాలు
అయితే సుశాంత్ మరణం తర్వాత కొందరు తనతో సంబంధం లేని వ్యక్తులు కూడా మాకు క్లోజ్ అని చెప్పుకోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నది. అలాగే సిద్ధార్థ పితాని, సందీప్ సింగ్, మహేష్ శెట్టి లాంటి వ్యక్తుల స్టేట్‌మెంట్లకు పొంతన కుదరడంతో సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటి ముందు రెండు అంబులెన్సులు
ఇక సుశాంత్ మరణించిన తర్వాత రెండు అంబులెన్సులు ఇంటికి తీసుకురావడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ సింగ్, పితాని ఒకటే అంబులెన్స్ వచ్చిందంటే.. మీడియా కవరేజ్‌లో ఇంటి ముందు రెండు అంబులెన్సులు ఉండటం కనిపించింది. ఇలాంటి అనుమానస్పద సంఘటనలు, వ్యక్తులు ఈ మరణాన్ని మిస్టరీగా మార్చాయి.

దీపేశ్ ఎక్కడ.. అదృశ్యం వెనుక అనుమానాలు
ఇక ఇలాంటి నేపథ్యంలో సుశాంత్ మరణంపై దీపేశ్ ఎక్కడ కనిపించకపోవడం సందేహాలు రేకెత్తిస్తున్నది. అలాగే సుశాంత్ మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతూ రచ్చ జరుగుతుంటే దీపేశ్ మాట్లాడకపోవడం ఆసక్తిగా మారింది. ఇంతకు దీపేశ్ ఎక్కడ ఉన్నారు? ఇంతకు ఆ రోజు సుశాంత్‌తో చివరి క్షణాలు గడిపాడా? ఇంతకు దీపేశ్ ఎవరు? సుశాంత్ ఉండటానికి కారణం ఏమిటి? అనే విషయాలు బయటకు రావాలంటే దీపేశ్ ఆచూకీ లభించాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











