సుశాంత్ సింగ్ సూసైడ్‌.. గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రశ్నల వర్షం! ఏకధాటిగా 8 గంటలపాటు ఉక్కిరిబిక్కిరి!

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సుశాంత్‌ మరణంతో ఏ మాత్రం చిన్న అనుమానం ఉన్న ఆ దిశగా పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకొని మరణించడం సంచలనం రేపింది. కూపర్ హస్పిటల్‌ జారీ చేసిన పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గురువారం సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty 8 hours Interrogation అనేక అనుమానాలు...!!
ఫ్యామిలీ ఫిర్యాదు చేయకపోవడంపై

ఫ్యామిలీ ఫిర్యాదు చేయకపోవడంపై

సుశాంత్ మరణం సూసైడ్ కాదు.. మర్డర్ అంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. అయితే అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఫిర్యాదు చేయకపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే విషయం ఆసక్తిగా మారింది. సుశాంత్ మరణం తర్వాత కుటుంబ సభ్యులు పాట్నాకు వెళ్లి ఆస్థికల నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే.

13 మందిని విచారించిన పోలీసులు

13 మందిని విచారించిన పోలీసులు

ముంబై పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా దాదాపు 13 మందిని ప్రశ్నించి వివరాలు సేకరించారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి, థింక్ ఇంక్ పీఆర్ ఏజెన్సీకి చెందిన రాధిక నిహలానీ, మాజీ బిజినెస్ మేనేజర్ శృతిమోడీని విచారించారు. అయితే రియా చక్రవర్తిని మాత్రం సుదీర్ఘంగా ప్రశ్నించడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆమెను ప్రశ్నించి వాగ్మూలాన్ని రికార్డు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

యష్ రాజ్ ఫిలింస్ కాంట్రాక్టుపై

యష్ రాజ్ ఫిలింస్ కాంట్రాక్టుపై

ఇక వివాదాస్పదమైన యష్ రాజ్ ఫిలింస్ కాంట్రాక్టుపై బాంద్రా పోలీసులు దృష్టిపెట్టారు. కాంట్రాక్టు కాపీని తెప్పించుకొని వివరాలను పరిశీలించారు. గతంలో సుశాంత్ యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన శుద్ద్ దేశీ రొమాన్స్, డిటెక్టివ్ బ్యోమ్‌కేష్ బక్షీ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్‌లో మూడు సినిమాలు చేయడానికి డీల్ కుదిరింది. ఆ క్రమంలోనే శేఖర్ కపూర్ రూపొందించాలనుకొన్న పానీ సినిమాలో సుశాంత్ సింగ్ నటించాల్సి ఉంది. ఆ చిత్రాన్ని కేన్స్ వేదికపై ప్రకటించినప్పటికీ... ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ సినిమా నిర్మాణాన్ని యష్ రాజ్ ఫిలింస్ నిలిపివేసింది.

 విచారణలో రియా చక్రవర్తి

విచారణలో రియా చక్రవర్తి

ఇక సుదీర్ఘమైన విచారణ సందర్భంగా రియా చక్రవర్తి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తున్నది. తొమ్మిది గంటలపాటు జరిగిన విచారణలో యష్ రాజ్‌ ఫిలింస్‌తో సుశాంత్ కాంట్రాక్టు ముగిసిందనే విషయాన్ని విచారణలో చెప్పినట్టు సమాచారం. అలాగే తనను కూడా కాంట్రాక్టు రద్దు చేసుకోమని సుశాంత్ చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే ఆ కాంట్రాక్టు విషయంలో లోతైన సమాచారం తనకు తెలియదనే విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తున్నది.

శేఖర్ కపూర్ పశ్చాత్తాపం

శేఖర్ కపూర్ పశ్చాత్తాపం

ఇక యష్ రాజ్ బ్యానర్‌లో రావాల్సిన పానీ సినిమా ఆగిపోవడంపై దర్శకుడు శేఖర్ కపూర్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్‌తో సినిమా చేయలేకపోవడం నిరాశను కలిగించింది. ఆ సినిమాను సుశాంత్‌తో చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ కుదర్లేదు. ఆ ప్రాజెక్టు ఆగిపోవడం సుశాంత్‌ను డిప్రెషన్‌లోకి నెట్టింది అని శేఖర్ కపూర్ తన ట్వీట్‌లో పేర్కొనడంతో ఆయనను ప్రశ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X