నొప్పి లేకుండా చచ్చిపోవాలని సుశాంత్ ప్లాన్.. ముంబై పోలీస్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెంది ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా అసలు కారణం తెలియడం లేదు. పోస్టుమార్టం రిపోర్ట్స్ ప్రకారం అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని మొదటి నుంచి ముంబై పోలీసులు మీడియాకు చెబుతున్నారు. కానీ మరోవైపు అది హత్యా అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ముంబై పోలీసులు సుశాంత్ మరణించే ముందు రోజు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన విషయాల గురించి ముంబై పోలీస్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందు ఏం చేశాడు?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న మరణించిన విషయం తెలిసిందే. బాంద్రా లోని తన రూమ్ లో విఘాత జీవిగా పడి ఉన్న సుశాంత్ అంతకు ముందు ఏం చేశాడు? ఎవరిని కలిశాడు? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. మెయిన్ గా ఇంట్లో అదే రోజు సీసీటీవీ కెమేరా పని చేయకపోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.

నొప్పి లేకుండా ఎలా చచ్చిపోవలని..?
ఇక ఇటీవల ముంబై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలను తెలియజేశారు. నొప్పి లేకుండా ఎలా చచ్చిపోవలనే విషయం గురించి తెలుసుకోవడానికి సుశాంత్ గూగుల్ లో సెర్చ్ చేశాడని చెబుతూ.. అలాగే బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా కీ వర్డ్స్ ని కూడా గూగుల్ లో సెర్చ్ చేసినట్లు తెలిపారు.

బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు..
ఇక ఈ స్టార్ నటుడు బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని చెప్పిన పోలీస్ అధికారులు.. దానికి చికిత్స తీసుకుంటున్నాడని కూడా అన్నారు. "సుశాంత్ తన గురించి మీడియాలో ఏమి రాస్తున్నాడో తెలుసుకోవడానికి గూగుల్ లో అతని పేరు కూడా సెర్చ్ చేసినట్లు తెలిపారు. ఎక్కువగా ‘నొప్పిలేకుండా మరణించడం ఎలా అనే విషయాన్ని కూడా సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోందని అన్నారు.

సుశాంత్ ఎక్స్ మేనేజర్ డెత్ ఎఫెక్ట్..?
ఇక సుశాంత్ తన ఎక్స్ మేనేజర్ దిశా సలైన్ విషయంలో కూడా కాస్త అప్సెట్ అయినట్లు తెలుస్తోందని, సుశాంత్ కి సంబంధించిన మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్ ని తనిఖీ చేయడం జరిగిందని ఒక పోలీస్ అధికారి తెలిపారు. 2019 జనవరి నుంచి 2020 జూన్ వరకు అతని ఎకౌంట్ లో 14.5కోట్లు ఉన్నాయని అన్నారు. అయితే అందులో నాలుగు కోట్లు ఫిక్సిడ్ డిపాజిట్ అని తెలియజేశారు.

మరోసారి ఇన్వెస్టిగేషన్..
పోలీసులు చెప్పిన ఈ కొత్త విషయాల కారణంగా మళ్ళీ ఈ కేసు మరో మలుపు తిరుగుతోందనే కథనాలు వెలువడుతున్నాయి. ఇక సుశాంత్ కి సన్నిహితంగా ఉండే వారిని చాలా మందిని ప్రశ్నించిన పోలీసులు మరోసారి స్నేహితులైన దీపేష్, సిద్దార్థ్ పితానిలను కూడా ఇన్వెస్టిగేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

వారిద్దరికీ నోటీసులు..
ఆదివారం సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద వారిద్దరికీ నోటీసులు పంపామని, ముఖాముఖి కూర్చుని స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని కోరినట్లు పాట్నా రేంజ్ ఐజిపి సంజయ్ సింగ్ సోమవారం నేషనల్ మీడియాకు తెలిపారు. రాత్రి దీపేశ్ పోలీసుల ముందు హాజరైనప్పటికీ ఇంకా సిద్ధార్థ్ రాలేదని కూడా వారు తెలియజేశారు. ఓ వైవు ముంబై పోలిసులు మరోవైపు బీహార్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ చేయడంతో ముందుగా ఎవరు ఈ కేసులో అసలు విషయాన్ని కనుగొంటారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











