షాకింగ్‌గా సుశాంత్ సింగ్ చివరి ఇన్స్‌టాగ్రామ్ పోస్టు.. సూసైడ్‌కు ముందే పక్కాగా ప్లాన్?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఎవరైనా భావోద్వేగానికి గురిచేసుకొంటూ కంటతడి పెట్టించక మానదు. తన మరణానికి ముందు తన తల్లి గురించి తలచుకొని ఎమోషనల్ అయినట్టు అర్ధమవుతున్నది. మరణానికి కారణం అతడికి ఉన్న మానసిక సమస్యలేనా అనే కోణంలో అనుమానాలు తలెత్తతున్నాయి. ఆ పోస్టులో ఏమున్నదంటే..

Recommended Video

Sushant Singh Rajput Latest News And His last Instagram Post
టీనేజ్‌లోనే తల్లిని కోల్పోయిన సుశాంత్

టీనేజ్‌లోనే తల్లిని కోల్పోయిన సుశాంత్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన టీనేజ్ వయసులోనే తల్లిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఒంటరితనంతో బాధపడుతుంటారనేది తన స్నేహితులు, సన్నిహితులు చెప్పుకొంటారు. ఎప్పుడూ తన తల్లి గురించి ఆలోచిస్తుంటారని, తన తల్లి లేని లోటుతో ఎంతో బాధపడతుంటారనే విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది.

గతేడాది తల్లిని గుర్తు చేసుకొని కవిత

గతేడాది తల్లిని గుర్తు చేసుకొని కవిత

గతేడాది తన తల్లిని గుర్తు చేసుకొని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎమోషనల్‌గా ఓ కవితను రాశారు. ఆ కవితతో ఎంతో మందిని భావోద్వేగానికి గురిచేశారు. ఎప్పటికీ నిన్ను వదిలి ఉండనని నాకు ప్రామిస్ చేశావు. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటానని నేను కూడా ప్రామిస్ చేశాను. కానీ మనం చేసుకొన్ని ప్రామిస్‌లను ఇద్దరం తుంగలో తొక్కాం అని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన కవితలో పేర్కొన్నారు.

మరణానికి ముందు చివరి ఇన్స్‌టా పోస్టు

మరణానికి ముందు చివరి ఇన్స్‌టా పోస్టు

మసక బారిన నా గతం కన్నీటి ధారల మధ్య ఆవిరైపోతున్నది. తరగని నా కలలు, ఆగమ్య గోచరంగా ఉన్న జీవితం మధ్య చిరునవ్వును కుంచించుకు పోతున్నది అంటూ తాజాగా తన పోస్టును ఎమోషనల్‌గా మలిచాడు. అలాగే తన తల్లి ఫోటోను, తన కాలేజీ జీవితంలోని ఫోటోను కలిపి ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

మరణానికి ముందు మానసిక వేదన

మరణానికి ముందు మానసిక వేదన

దీంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముందుగానే ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇలాంటి పోస్టు పెట్టి ఉంటారనే విషయాన్ని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తన తల్లి వద్దకు చేరే ప్రయత్నంలోనే కొన్ని రోజులు మానసికంగా వేదనను అనుభవింంచి ఉంటారనే విషయాన్ని పేర్కొంటున్నారు.

2002లో సుశాంత్ సింగ్ తల్లి మరణం

2002లో సుశాంత్ సింగ్ తల్లి మరణం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తల్లి మరణం 2002లో జరిగింది. అప్పుడు సుశాంత్ వయసు 16 ఏళ్లు. అప్పటి నుంచి ఒంటరిగానే జీవితం నెట్టుకొంటు వస్తున్నారు. ముుంబైలో కెరీర్ కోసం ఎదురైన ఒత్తిడులు, సమస్యలు ఎదురైనప్పుడల్లా తన తల్లి గుర్తు చేసుకొని ఓదార్పు పొందుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X