సుశాంత్ తన మరణానికి ముందు.. ఆ ఇద్దరికి ఫోన్‌కాల్స్.. ఏం మాట్లాడారంటే..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. 34 ఏళ్ల ఈ యువ హీరో బాంద్రాలోని తన నివాసంలో ఊరేసేకొని మరణించారు. బహుశా జూన్ 14వ తేదీ అర్ధరాత్రి 12.45 గంటలకు మరణించి ఉంటారనే విషయంపై ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే మొబైల్, వాట్సప్ ఆధారంగా ఆయన మరణం వెనుక కారణాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఆసక్తికరంగా ఓ ఇద్దరికి ఫోన్ చేసినట్టు బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..

పని మనిషి గురించడంతో
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పనిమనిషి ఆదివారం ఉదయమే డోర్ కొట్టడంతో ఎలాంటి స్పందన రాలేదు. దాంతో తన వద్ద ఉన్న తాళం చెవుల సహాయంతో ఇంట్లోకి వెళ్లారు. అయితే తన బెడ్ రూమ్‌లో ఉరేసుకొని వేలాఢుతుండంతో వెంటనే తన సోదరి, బావకు ఫోన్ చేశారు. దాంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ వార్త వెలుగులోకి వచ్చింది అని పోలీసులు తెలిపారు.

మొబైల్, వాట్సప్ ఛాట్‌తో
తన మరణానికి ముందు ఎవరెవరెవరికి ఫోన్ చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. చివరి రెండు కాల్స్ చేసిన వ్యక్తులను గుర్తించి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పరిస్థితి ఏమిటనే విషయాన్ని తెలుసుకొంటున్నారు. చివరిసారిగా తన స్నేహితుడు మహేష్ శెట్టికి కాల్స్ చేసి మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. పవిత్ర రిస్తా ప్రొగ్రాంలో సుశాంత్‌తో కలిసి మహేష్ శెట్టి పనిచేశారు.

సోదరితో రాత్రి ఫోన్‌లో
ఇక మహేష్ శెట్టికి కాల్స్ చేయడానికి మరో కాల్ తన సోదరికి కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. శనివారం రాత్రం 9.30 గంటల ప్రాంతంలో తన సోదరితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. అయితే తన సోదరి స్పందన తెలిస్తే.. ఆ సమయంలో సుశాంత్ మానసిక పరిస్థితి ఎలా ఉందోననే విషయం బయటపడుతుంది.
Recommended Video

షారుక్ ఖాన్ తన సంతాపంలో..
ఇక సుశాంత్ మరణంపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నేనంటే సుశాంత్‌కు ఎంతో ఇష్టం. అతడు లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అతడి ఎనర్జి, ఉత్సాహం, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖం నన్ను వెంటాడుతున్నది. తన కుటుంబానికి, స్నేహితులకు మనోధైర్యం ఇవ్వాలని, సుశాంత్ ఆత్మకు శాంతి కలుగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని షారుక్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











