twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రియా చక్రవర్తి అరెస్ట్ త్వరలోనే’.. లాయర్ సంచలన వ్యాఖ్యలు.. బెయిల్‌ కోసం హీరోయిన్ ఆరాటం

    |

    బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక కారణాలపై ముంబై పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబ సభ్యులు ఈ కేసు దర్యాప్తులోకి రంగ ప్రవేశం చేశారు. పాట్నాలోని పోలీస్ స్టేషన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో సుశాంత్ ఫ్యామిలీ అడ్వకేట్ వికాస్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ..

    ఆ పేర్లను సుశాంత్ ఫ్యామిలీ ఎందుకు బయటపెట్టాలి

    ఆ పేర్లను సుశాంత్ ఫ్యామిలీ ఎందుకు బయటపెట్టాలి

    సుశాంత్ సింగ్ మరణం కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న తీరుపై కుటుంబానికి నమ్మకం పోయింది. అలాగని ముంబై పోలీసుల విభాగాన్ని మొత్తం తప్పుపట్టడం లేదు. సుశాంత్ మరణానికి ఐదు, ఆరు నిర్మాణ సంస్థలు కారణమని ఫ్యామిలీ భావిస్తున్నది. వాటి పేర్లను ఫ్యామిలీ ఎందుకు బయటపెట్టాలి? సుశాంత్ మరణంతోనే చాలా డిస్ట్రబ్ అయ్యారు. అలాంటి సమయంలో ఇతరులపై ఆరోపణలు చేసేంత శక్తి వారికి లేదు అని వికాస్ సింగ్ తెలిపారు.

    అందుకే పాట్నాలో కేసు రిజిస్టర్ చేశాం

    అందుకే పాట్నాలో కేసు రిజిస్టర్ చేశాం

    సుశాంత్ సింగ్ కేసును లాజికల్‌గా దర్యాప్తు చేయాలి. అలాంటి దర్యాప్తు ముంబై పోలీసులు చేయడం లేదు. అందుకే పాట్నాలో కేసు రిజిస్టర్ చేశారు. సుశాంత్ మరణానికి కారణం ఎవరన్నది నేను ఆరోపించడం భావ్య కాదు. ఈ విషయంలో సుశాంత్ సింగ్‌కు న్యాయం జరుగాలి. ముంబై పోలీసులను తప్పుపట్టడం మా అభిమతం కాదు అని వికాస్ స్పష్టం చేశారు.

    అరెస్ట్ కోసం వేచి చూస్తున్నాం

    అరెస్ట్ కోసం వేచి చూస్తున్నాం

    సుశాంత్ మరణం నుంచి కోలుకోలేని కుటుంబం దర్యాప్తు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలిస్తున్నది. అందుకే మౌనంగా పరిస్థితులన్నింటిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న రియా చక్రవర్తి అరెస్ట్ కోసం వారు మౌనంగా వేచి చూస్తున్నారు. తాను కూడా ఈ వ్యవహరంలో మౌనంగా ఉన్నాను. ఎఫ్ఐఆర్‌లో ఉన్న వారి అరెస్ట్ కోసం వేచిచూస్తున్నాం. అప్పటి వరకు మాట్లాడదలచుకోలేదు అని వికాస్ సింగ్ పేర్కొన్నారు.

    త్వరలోనే అరెస్ట్ జరిగే అవకాశం

    త్వరలోనే అరెస్ట్ జరిగే అవకాశం

    సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలి. అతి త్వరలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయనే ఆశాభావాన్ని వికాస్ సింగ్ వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టులు జరిగితేనే అసలు విషయాలు బయటకు వస్తాయి. అప్పడే ఈ కేసుకు, సుశాంత్‌కు న్యాయం జరుగుతుంది అని వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    ముందస్తు బెయిల్‌కు రియా ప్రయత్నాలు

    ముందస్తు బెయిల్‌కు రియా ప్రయత్నాలు

    ఇదిలా ఉండగా, తనపై పాట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో రియా చక్రవర్తి అప్రమత్తమయ్యారు. ఇప్పటికే న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి సంఘటనలతో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ ఆసక్తిని రేపుతున్నది.

    English summary
    Sushant Singh Rajput Case: Sushant Singh Rajput father KK Singh alleges Rhea Chakraborty exploited financially. KK Singh has filed an FIR against Rhea Chakraborty in Rajiv Nagar Police station in Patna. The FIR has been lodged against Rhea Chakraborty under Sections 340, 342, 380, 406, 420, 306 of the IPC. In this occassion, Sushant Singh Rajput lawyer Vikas Singh reacted on Rhea Chakraborty arrest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X