ఫిలింఫేర్ అవార్డుల్లో గ్రూప్ డ్యాన్సర్‌ నుంచి ఎంఎస్‌ ధోని వరకు.. సుశాంత్‌ను విధి కాటేసిందలా!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న అభిమానులు, ఎంతోగానే ప్రేమించిన, అభిమానించిన స్నేహితులు, సన్నిహితులను విషాదంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎన్నో ఆటుపోట్ల మధ్య ఊగిసలాడిన జీవితాన్ని నియంత్రించుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించే ప్రయత్నంలో కొంత వరకు విజయం సాధించారు. బాలీవు‌డ్‌లో ఎంతో భవిష్యత్ ఉందనుకొంటున్న సమయంలో ఊహించని విధంగా జీవితం చాలించి అందర్నీ విషాదంలో ముంచెత్తారు. సుశాంత్ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

ఢిల్లీలో షైమాక్ దావర్ వద్ద

ఢిల్లీలో షైమాక్ దావర్ వద్ద

సుశాంత్‌ ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుకుంటూనే నటుడికి కావాల్సిన అన్ని హంగులను తనలో ఉండేలా చూసుకొన్నాడు. ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ షైమాక్ దావర్ వద్ద డ్యాన్స్ క్లాసులు తీసుకొన్నారు. డ్యాన్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపడంతో తన కీలకమైన బృందంలో సుశాంత్‌ను షైమాక్ దావర్ చేర్చారు.

51 ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేదికపై గ్రూప్ డ్యాన్సర్‌గా

51 ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేదికపై గ్రూప్ డ్యాన్సర్‌గా

షైమాక్ దావర్ ట్రూప్‌లో కీలక సభ్యుడిగా, గ్రూప్ డ్యాన్సర్‌గా 2006 సంవత్సరంలో 51 ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలు పాటలకు వేదికపై ఓ బృందంలో ఓ సభ్యుడిగా డ్యాన్స్ చేయడం గమనార్హం. అలాగే 2006లో కామన్ వెల్త్ గేమ్స్‌ ఓపెనింగ్ వేడుక కోసం ఆస్ట్రేలియాలో ప్రదర్శన ఇచ్చారు.

గ్రూప్ డ్యాన్సర్ నుంచి యాక్టర్‌గా

గ్రూప్ డ్యాన్సర్ నుంచి యాక్టర్‌గా

డ్యాన్సర్ అవుదామని అనుకొంటున్న సమయంలో తన ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌ను పక్కన పెట్టి పూర్తిస్థాయిలో డ్యాన్స్ క్లాసులకే పరిమితమయ్యారు. ఆ సమయంలో యాక్టర్‌గా ట్రై చేయమనే సలహాలతో ముంబైకి చేరుకొన్నారు. ముంబైలో అడుగుపెట్టిన తర్వాత సుశాంత్‌కు ఎదురే లేకుండా పోయింది.

Recommended Video

Sushant Singh Rajput Latest News And His last Instagram Post
ముంబైలో డ్యాన్సర్‌గా.. యాక్టర్‌గా

ముంబైలో డ్యాన్సర్‌గా.. యాక్టర్‌గా


ముంబై చేరుకొన్న సుశాంత్ సింగ్ ఓ పక్కన డ్యాన్సు క్లాసులు, ప్రదర్శనలు చేస్తూనే యాక్టింగ్ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముంబైలో నదిరా బబ్బర్‌కు చెందిన ఎక్‌జూటే థియేటర్ గ్రూప్‌లో చేరారు. ఆ తర్వాత టీవీ వ్యాపార ప్రకటనల్లో నటించారు. నెస్లే మంచ్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X