బీహార్‌లో ఓ వీధికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు.. భౌతికంగా లేకపోయిన సజీవంగా ఉంటారంటూ..
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణాన్ని ఇంకా తన సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గురించి ఆలోచిస్తూనే తమకు తోచిన విధంగా నివాళులర్పిస్తున్నారు. ఇక ఆయన జన్మస్థలానికి సంబంధించిన అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన పుట్టిన పట్టణంలోని ఓ వీధికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టుకోవడం విశేషంగా మారింది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Recommended Video

పుర్ణియాతో సుశాంత్‌కు అనుబంధం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జన్మస్థలం బీహార్‌లోని పుర్ణియా. అక్కడే సుశాంత్ బాల్యం, విద్యాభ్యాసం జరిగింది. తన తల్లి మరణించేంత వరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆ పట్టణంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఉన్నత చదువులు చదివేందుకు ఢిల్లీకి వెళ్లడం.. ఆ తర్వాత సినిమా కెరీర్ కోసం ముంబైలో అడుగుపెట్టడం జరిగిపోయాయి.

బాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్‌గా
హిందీ చిత్ర పరిశ్రమలో కాయ్ పో చే చిత్రంలో సినీ కెరీర్ ఆరంభించిన సుశాంత్ ఆ తర్వాత ఎంఎస్ ధోని, రాబ్దా, చిచ్చోరే అలాంటి హిట్లను తన ఖాతాలో వేసుకొన్నారు. ఇటీవల అనూహ్య పరిస్థితుల్లో జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన బాంద్రా నివాసంలో సూసైడ్ చేసుకోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.

ఫోర్ట్ కంపెనీ చౌక్‌కు సుశాంత్ పేరు
తన పట్టణం నుంచి ముంబైకి వెళ్లి బాలీవుడ్‌లో గొప్ప పేరు సంపాదించిన సుశాంత్‌కు నివాళిగా పుర్ణియా ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకొన్నారు. పుర్ణియా పట్టణంలోని ఫోర్డ్ కంపెనీ చౌక్ వీధికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చౌక్‌గా మార్చారు. పట్టణంలోని కొందరు అభిమానులు ఆ కార్యక్రమంలో పాల్గొన ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భౌతికంగా లేకపోయినా.. సజీవంగా అందరి గుండెల్లో
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరును ఓ స్ట్రీట్‌కు పెట్టిన సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆయన ప్రతిభను గుర్తు చేసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భౌతికంగా సుశాంత్ లేకపోయినప్పటికీ.. ఆయన నటించిన సినిమాలతో ప్రతీ ఒక్కరి హృదయాల్లో సజీవంగా ఉన్నారు. ఆయన ఈ పట్టణానికి తీసుకొచ్చిన పేరు ప్రఖ్యాతులకు గుర్తుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టుకొన్నాం అని అన్నారు.

డిస్నీ ఓటీటీలో దిల్ బేచారా రిలీజ్
ఇదిలా ఉండగా, సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా జూలై 24న ఓటీటీలో రిలీజ్ కానున్నది. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్‌స్టార్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రంలో సంజనా సంఘీ హీరోయిన్‌గా నటించింది. ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహించారు. సుశాంత్ స్నేహితుడు, క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











