ఆమె కోసం ప్రతి నెల 4.5 కోట్లు? దారుణంగా సుశాంత్ సొమ్మంతా.. తీగలాడుతున్న ఈడీ

దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ్యాంకు అకౌంట్లలో అవకతవకలు, నిధుల అక్రమ మళ్లింపు అంశాలపై దృష్టి పెట్టి ఈడీ చేస్తున్న దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సుశాంత్ సొమ్ము భారీగా దుర్వినియోగమైందనే విషయం, అలాగే రియా చక్రవర్తి దారుణంగా వాడుకొనేసిందనే విషయాల మధ్య అంకిత లోఖండే కోసం భారీగా డబ్బు ఖర్చు పెడుతున్న అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే జరిపిన పరిశోధనలో అంకిత లోఖండేకు సంబంధించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput- Ankita Lokhande ఫ్లాట్ కోసం EMI కడుతున్నాడన్న వార్తలపై స్పందించిన అంకిత!
15 కోట్ల రూపాయల మళ్లింపు

15 కోట్ల రూపాయల మళ్లింపు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకౌంట్‌ అనేక రూపాల్లో దుర్వినియోగం జరుగుతున్నది. భారీగా ఆయన అకౌంట్ నుంచి అనుమానాస్పద విధంగా ఖర్చు చేశారు. దాదాపు 15 కోట్ల రూపాయాలు అక్రమంగా తరలించారు అని పాట్నాలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

అంకిత ఫ్లాట్ కోసం సుశాంత్ డబ్బు

అంకిత ఫ్లాట్ కోసం సుశాంత్ డబ్బు

సుశాంత్ అకౌంట్లలో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన విషయంపై ఈడీ అధికారులు విచారించిన సమయంలో రియా చక్రవర్తిని కొన్ని వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చినట్టు సమాచారం. ఆరేళ్లపాటు డేటింగ్ చేసిన అంకితా లోఖండేకు భారీగా ఖర్చు చేస్తున్నారని విషయాన్ని స్పష్టం చేసిందట. కొన్నేళ్ల క్రితం అంకిత లోఖండే కోసం కొనుగోలు చేసిన ఫ్లాట్ ప్రతి నెల సుశాంత్ ఈఎంఐలు కడుతున్నారని రియా పేర్కొన్నట్టు సమాచారం.

ప్రతి నెల 4.5 కోట్లు వాయిదా సొమ్ముగా

ప్రతి నెల 4.5 కోట్లు వాయిదా సొమ్ముగా

ముంబైలోని మలాడ్ ప్రాతంలో అంకితా లోఖండే కోసం కొన్నేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. ఆ ఫ్లాట్ కోసం ప్రతి నెల రూ.4.5 కోట్ల మేర ఈఎంఐ కడుతున్నారనే విషయం బయటకు రాగా, ఆమె నుంచి విషయాలు బయటకు రాబట్టేందుకు మీడియా ప్రయత్నాలు చేయగా అంకిత స్పందించలేదనే విషయం బయటకు వచ్చింది.

అంకితా ఆధీనంలోనే ఫ్లాట్

అంకితా ఆధీనంలోనే ఫ్లాట్

సుశాంత్ ఈఎంఐలు చెల్లిస్తున్న మలాడ్ ఫ్లాట్‌లో అంకితా లోఖండే అక్రమంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆధీనంలోనే ఆ ఫ్లాట్ ఉంది అనే విషయం మీడియా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం అంకితా స్పందిస్తే గానీ విషయంపై స్పష్టత వస్తుందనే పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సుశాంత్ పెట్టుబడులపై ఈడీ నజర్

సుశాంత్ పెట్టుబడులపై ఈడీ నజర్

ఇలాంటి భిన్న కథనాల నేపథ్యంలో సుశాంత్ బ్యాంకు అకౌంట్లు, ఆస్తుల కొనుగోలు, పెట్టుబడులు లాంటి అంశాలపై ఈడీ అధికారులు నిశితంగా దృష్టిపెడుతున్నారు. ఈ విషయంలో రియా చక్రవర్తిని రెండుసార్లు ప్రశ్నించారు. అలాగే సుశాంత్ ఫ్యామిలీని, సిబ్బందిని కొద్ది రోజులుగా ప్రశ్నిస్తూ స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X