సుశాంత్‌కు రియా చక్రవర్తి అలాంటి డ్రగ్స్.. స్టింగ్ ఆపరేషన్‌లో ఫిజికల్ ట్రైనర్ సంచలన విషయాలు!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు రియా చక్రవర్తి అనుసరించిన తీరు గురించిన సంచలన విషయాలను ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ సమీ ఆహ్మద్ బయటపెట్టారు. ప్రముఖ జాతీయ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో రియా, సుశాంత్ మధ్య ఉన్న సంబంధాలను వెల్లడించారు. ఆయన స్టిగ్ ఆపరేషన్‌లో ఆయన వెల్లడించిన విషయాలు ఏమిటంటే..
Recommended Video

సుశాంత్‌తో 5 ఏళ్లుగా పనిచేస్తున్నా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో గత 5 ఏళ్లుగా కలిసి తాను పనిచేస్తున్నాను. ఆయన చాలా కష్టపడారు. శరీరం గురించే కాకుండా, మానసిక ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ చూపిస్తాడు. సాధారణంగా సినీ తారలు ఐస్ క్రీమ్, జంక్ ఫుడ్ లాంటివి తినరు. కానీ సుశాంత్ వాటిని తిని కూడా తన దేహాన్ని చాలా ఫిట్‌గా ఉంచుకొంటారు అని సమీ ఆహ్మద్ తెలిపారు.

రియాతో అఫైర్ తర్వాత సుశాంత్ పరిస్థితి
హీరోయిన్ రియా చక్రవర్తితో అఫైర్ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పరిస్థితి అంతా మారిపోయింది. ఆమె ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన అదోలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. సుశాంత్‌కు రియా వైద్యులు సలహాలు తీసుకోకుండానే డ్రగ్స్ ఇచ్చారు అని సమీ ఆహ్మద్ ఆరోపించారు.

కౌన్సిలింగ్ చేయకుండానే డ్రగ్స్
సుశాంత్‌కు చికిత్స చేసే డాక్టర్‌కు అంతకు ముందు ఆయనకు ఏమి జరిగిందనే విషయం తెలియదు. మరో డాక్టర్ చేసిన చికిత్సను, కౌన్సిలింగ్ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆయన సుశాంత్‌కు రియా పర్యవేక్షణలో ఒక డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారు. సుశాంత్ మానసిక పరిస్థితి తెలియకుండానే రియా తీసుకొచ్చిన వైద్యుడు చికిత్స చేశారు. ఆయన ఆరోగ్య సమస్యలు తెలియకుండా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అని సమీ ఆహ్మద్ పేర్కొన్నారు.

జూన్ 1వ తేదీన నాతో ఫోన్‌లో మాట్లాడిన సుశాంత్
సుశాంత్ తన మరణానికి రెండు వారాల ముందు నాతో మాట్లాడారు. నా తల్లి మే 29న మరణిస్తే ఆ విషయం తెలుసుకొని జూన్ 1వ తేదీన నాకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు. ఎలాంటి అవసరం ఉన్నా నాకు చెప్పమని అడిగారు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్లి కలిశాను. అప్పుడు తండ్రిని బాగా చూసుకోమని చెప్పారు. తల్లి మరణం వల్ల ఎలాంటి విషాదం ఉంటుందో నాకు తెలుసు అని సమీ ఆహ్మద్ తెలిపారు.

నాకు, అమ్మకు చాలా క్లోజ్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మంచి హృదయం ఉన్న మనిషి. ఆయన అందరిలాంటి వారు కాదు. నాకు, నా తల్లికి చాలా క్లోజ్. నాతో మాట్లాడిన రెండు వారాల్లోనే ఆయన మరణ వార్త వినడం నాకు చాలా బాధకలిగింది. సుశాంత్ మరణం వార్త విని కోలుకోవడానికి చాలా సమయం పట్టింది అని సమీ ఆహ్మద్ స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











