అద్దెకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్యూప్లెక్స్ ఇల్లు.. సినీ తారలకు నో ఛాయిస్.. ఇంటి కిరాయి ఎంతంటే!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి సరిగ్గా ఏడాది పూర్తయింది. 2020 సంవత్సరం జూన్ 14వ తేదీన యువ హీరో అనుమానాస్పద పరిస్థితుల్లో ముంబైలోని బంద్రాలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో మృతి చెందడం విషాదంగా మారింది. అయితే ఇంటిని ప్రస్తుతం అద్దెకు పెట్టడం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. అందుకు కారణం ఏమిటంటే...

విశాలమైన భవనం

విశాలమైన భవనం

సుశాంత్ తన మరణానికి ముందు బాంద్రాలోని ప్రముఖ మౌంట్ బ్లాంక్ బిల్డింగ్‌లోని త్రీ బెడ్రూం డూప్లెక్స్ ఫ్లాట్‌లో నివసించాడు. దీని వైశాల్యం 3600 చదరపు అడుగులు. ఈ డూప్లెక్స్ హౌస్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లో విశాలమైన ఫ్లోర్, పై ఫ్లోర్‌లో మూడు బెడ్రూంలు ఉన్నాయి. అలాగే మూడు కార్లను పార్క్ చేసుకొనే వెసులు బాటు కూడా ఉంది.

బాంద్రాలోని విలాసవంతమైన ప్రదేశంలో

బాంద్రాలోని విలాసవంతమైన ప్రదేశంలో

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివసించిన డూప్లెక్స్ భవనం బాంద్రాకు సమీపంలోని జాగర్ పార్కుకు సమీపంలో ఉంది. సముద్ర తీరానికి అభిముఖంగా ఉండే ఈ ఇంటిని సుశాంత్ చాలా ఇష్టపడేవారని సన్నిహితులు చెబుతారు. ఈ ఇంటిలోనే తన ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు తన స్నేహితుడు సిద్దార్థ్ పితాని, నీరజ్, కేశవ్ అనే ఇద్దరు పని మనుషులతో ఉన్నారు.

సుశాంత్ ఆత్మహత్య‌తో

సుశాంత్ ఆత్మహత్య‌తో

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2019 డిసెంబర్‌లో డూప్లెక్స్ ఇంటిని 36 నెలల పాటు ఉండేందుకు, నెలకు రూ.4.5 లక్షల చొప్పున అద్దె చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకొన్నాడు. ఈ ఇంటిలో చేరిన ఆరు, ఏడు నెలల తర్వాత సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించారు. అప్పటి నుంచి ఈ ఇల్లు ఖాళీగానే ఉంది. గత సంవత్సర కాలంగా ఖాళీగానే ఉండటంతో మళ్లీ అద్దెకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో

సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో

ప్రస్తుతం ముంబైలో పరిస్థితులు బాగా లేకపోవడం, కరోనావైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ముంబైలో అద్దె రేట్లు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం రూ.4 లక్షలకే అద్దెకు ఇవ్వడానికి ఇంటి యజమాని సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ ఇంటిని తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టు బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడించింది.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Filmibeat Telugu
సినీ తారలకు నో ఛాయిస్

సినీ తారలకు నో ఛాయిస్

సుశాంత్ నివసించిన ఇల్లు అద్దెకు పెట్టడంతో పలువురు సినీ తారలు ఆ ఇంటిని చూశారు. దానిని తీసుకొనేందుకు ఆసక్తి కూడా చూపుతున్నారు. కానీ ఇంటి యజమాని మాత్రం సినీ తారలకు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు. సినీ తారలతో తలనొప్పులు పడలేదని స్పష్టం చేస్తున్నారనే విషయం బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X