twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌ది సూసైడ్ కాదు మర్డర్.. మరణం వెనుక కుట్ర: పోలీసు ఉన్నతాధికారి సంచలన ఆరోపణలు

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొన్నారనే వార్త వినిగానే చాలా మంది పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన సూసైడ్ చేసుకోనేంత పిరికి వాడు కాదంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే సుశాంత్ మరణంపై మీడియాలో పలు కథనాలు కూడా అనుమానాస్పద రీతిలో అంటూ ప్రచురించారు. అయితే సుశాంత్‌కు శవ పరీక్ష నిర్వహించిన పోలీసులు ఆయన మరణం వెనుక గుట్టును విప్పారు. పోలీసులు రిపోర్టు ఏమిటంటే..

    సుశాంత్ సింగ్ పిరికివాడు కాదు

    సుశాంత్ సింగ్ పిరికివాడు కాదు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం వెనుక కుట్ర దాగి ఉంది. సూసైడ్ చేసుకొనేంత పిరికివాడు సుశాంత్ కాడు. ఈ వ్యవహారాన్ని పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలి. అప్పుడే సుశాంత్ మృతి వెనుక అసలు విషయాలు బయటకు వస్తాయి. అతడిది పక్కా హత్యే అని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

    సూసైడ్ కాదు మర్డర్

    సూసైడ్ కాదు మర్డర్

    హర్యానా ముఖ్యమంత్రి క్యారాలయంలో స్పెషల్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బావ, అడిషినల్ డీజీపీ ఓపీ సింగ్ యువ హీరో మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణానికి ముందు ఏదో నేరపూరిత కుట్ర జరిగి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలి అని ఆయన డిమాండ్ చేశారు.

    2 గంటలపాటు పోస్టు మార్టమ్

    2 గంటలపాటు పోస్టు మార్టమ్

    బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకొన్న సుశాంత్‌ దేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో డాక్టర్ ఆర్ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్ మార్చురికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. దాదాపు 2 గంటలపాటు జరిగిన పోస్టుమార్టమ్‌ను వీడియోగా చిత్రీకరించారు. ఊపిరి అందకపోవడం వల్లే సుశాంత్ మరణించారు. ఆయనమెడ చుట్టు తాడు బిగించడం వల్ల మరకలు ఏర్పడ్డాయి అని ప్రాథమికంగా రిపోర్టులో తెలిపారు.

    సుశాంత్‌కు కరోనావైరస్ లేదు

    సుశాంత్‌కు కరోనావైరస్ లేదు

    అలాగే సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆయన కోవిడ్ 19 వ్యాధికి గురికాలేదనే విషయం స్పష్టమైంది. ఎందుకంటే కరోనా వ్యాధికి గురైన వ్యాధిగ్రస్తులకు పోస్టు మార్టమ్ నిర్వహించరు. సుశాంత్‌కు కరోనా వ్యాధి సోకనందునే పూర్తిస్థాయిలో పోస్టుమార్టమ్ చేశారని వైద్య నిపుణులు వెల్లడించారు. అలాగే సుశాంత్ దేహంలోని కొన్ని కీలక అవయవాలను పరీక్ష కోసం జేజే హాస్పిటల్ ల్యాబ్‌కు పంపించనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

     ఫ్లాట్‌లో నలుగురితో కలిసి

    ఫ్లాట్‌లో నలుగురితో కలిసి

    ముంబైలో సుశాంత్ సింగ్ నలుగురు సిబ్బందితో తన ఫ్లాట్‌లో ఉంటున్నారు. నీరజ్, కేశవ్ అనే బీహార్‌కు చెందిన ఇద్దరు వంట మనుషులు. గత మూడు సంవత్సరాలుగా వంట మనుషులుగా పనిచేస్తున్నారు. ఇంటిని శుభ్రపరిచే పనిమనిషి దీపక్ సావంత్‌తోపాటు స్నేహితుడు సిద్దార్థ్ పితానీ కూడా సుశాంత్‌తో ఉంటున్నారు. వీరిని కూడా పోలీసులు క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput Latest News And His last Instagram Post
     నెలరోజులుగా కుటంబంతో సంబంధాలు కట్

    నెలరోజులుగా కుటంబంతో సంబంధాలు కట్

    గత నెల రోజులుగా తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. తండ్రి, సోదరి, తన ప్రియురాలు రియా చక్రవర్తితో ఫోన్‌లో కూడా సంభాషించడం లేదనే విషయం కుటుంబ సభ్యులు తెలిపారు. లాక్‌డౌన్‌లో చాలా రోజులు ఒంటరిగానే ఉన్నారనే.. ఆ సమయంలోనే ఆయన మానసికంగా దెబ్బ తిని ఉంటారనే విషయాన్ని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు.

    English summary
    Bollywood Sushant Singh Rajput committed suicide on June 14th. In this tragedy moment, Sushant Singh Rajput's brother-in-law O.P. Singh made murder allegations goes sensational in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X