twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు.. మరణాంతరం అరుదైన గుర్తింపు

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచ్చోరి సినిమాకు జాతీయ ఉత్తమ అవార్డుల పురస్కారాల్లో గౌరవం దక్కింది. ప్రాంతీయ భాష చిత్రాల విభాగంలో చిచ్చోరే చిత్రం ఉత్తమ హిందీ చిత్రంగా నిలిచింది. సుశాంత్ మరణాంతరం ఈ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనవుతున్నారు. గతేడాది జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే.

    ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వం వహించిన చిచ్చోరి చిత్రంలో సుశాంత్ సింగ్‌తోతోపాటు శ్రద్దా కపూర్, వరుణ్ శర్మ, తాహీర్ రాజ్ భాసిన్, నవీన్ పోలిశెట్టి, తుషార్ పాండే తదితరులు నటించారు.

     Sushant Singh Rajputs Chhichhore gets Best movie in 67th National film awards

    ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాఘవ్ అనే కుమారుడికి తండ్రిగా అనిరుధ్ అనే పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు. ఈ సినిమాకు సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం పట్ల సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

    ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణంపై సీబీఐ, ఈడీ, ఎన్సీబీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

    English summary
    Late bollywood actor Sushant Singh Rajput's Chhichhore movie gets Best movie in 67th National film awards. Jury announced award in Regional movie category. This movie wins hearts of audience along with the Film critics in 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X