సుశాంత్ ఇంట్లో మరో విషాదం.. మృతిని తట్టుకోలేక ఒకరి మృతి.. అనారోగ్యంతో తండ్రి పరిస్థితి..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో యువ హీరో ఇంట్లో మరో విషాదం చోటుచేసుకొన్నది. సుశాంత్ ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేని తన వదిన, కజిన్ అమరేంద్ర సింగ్ భార్య ఆకస్మికంగా మృత్యువు ఒడిలోకి చేరుకొన్నది. ఇప్పటికే పీకల్లోతు విషాదంలో కూరుకుపోయిన కుటుంబ సభ్యులకు ఈ ఘటన మరింత దు:ఖాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే..

 మరణ వార్త విన్న తర్వాత వదిన

మరణ వార్త విన్న తర్వాత వదిన

జూన్ 14 ఆదివారం సుశాంత్ సింగ్ మరణవార్త వెలుగు చూడగానే సినీలోకమే కాకుండా సాధారణ ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇక కుటుంబ సభ్యుల పరిస్థితిలో మాటలకు అందనిది. సుశాంత్ మరణ వార్త విన్నప్పటి నుంచి తన సోదరుడి భార్య సుధా దేవీ ఆహార పానీయాలు తీసుకోవడం మానేశారు. దాంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని బంధువులు వెల్లడించారు.

మెడిసిన్స్, ఆహారం తీసుకోకపోవడంతో

మెడిసిన్స్, ఆహారం తీసుకోకపోవడంతో

సుశాంత్ వదిన సుధా దేవీ కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుశాంత్ మరణ వార్తను విన్నప్పటి నుంచి ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా మెడిసిన్స్, ఆహారం తీసుకోవడం మానేశారు. దాంతో ఆమె ఆరోగ్యం విషమించింది. సోమవారం ఉదయం అపస్మారక స్థితిలో కి వెళ్లిపోయారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశాం అని బంధువులు తెలిపారు.

సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే

సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే

హాస్పిటల్‌లో అందించిన చికిత్సకు సుధా దేవి స్పందించలేదు. ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే అపస్మారక స ఆమె తుదిశ్వాస విడిచారు. తన భార్య మరణంతో అమరేంద్ర సింగ్ షాక్ గురయ్యారు అని బంధువులు మీడియాకు వెల్లడించారు. సుశాంత్ తన పూర్వీకుల గ్రామం మల్దిహా (పుర్ణియా)లో సోమవారం 5 గంటల ప్రాంతంలో ఆమె మరణించారని పేర్కొన్నారు.

తీవ్ర అనారోగ్యం బారిన సుశాంత్ తండ్రి

తీవ్ర అనారోగ్యం బారిన సుశాంత్ తండ్రి

ఇది ఇలా ఉండగా, సుశాంత్ సూసైడ్ వార్త వినగానే తండ్రి కూడా అనారోగ్యం పాలయ్యారు. ఆయనను హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. సుశాంత్ ఊహించని విధంగా ఈ లోకం నుంచి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఇంకా ఆ షాక్ నుంచి బయటకు రాలేదు. ఇప్పట్లో వారు సాధారణ పరిస్థితుల్లోకి రావడం కష్టమేనని సన్నిహితులు వెల్లడించారు.

Recommended Video

Sushant Singh Rajput’s గర్ల్ ఫ్రెండ్ Rhea Chakraborty To Be Qestioned By పోలీస్
సుశాంత్ సూసైడ్ నేపథ్యంలో

సుశాంత్ సూసైడ్ నేపథ్యంలో

గత ఆర్నెళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ శనివారం అర్ధరాత్రి ముంబైలోని తన నివాసంలో సూసైడ్ చేసుకొన్న సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు జూన్ 15వ తేదీన ముంబైలోని నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సన్నిహితులు, స్నేహితులను ముంబై పోలీసులు విచారిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X