సుశాంత్ దేహం పక్కన ‘మిస్టరీ’ మహిళ.. అనుమానాస్పద ముసుగులో ఆ ఇద్దరు? వారెవరంటే
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో ముంబై పోలీసులు దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో మరో విషంయ సంచలనంగా మారింది. సుశాంత్ మరణించిన జూన్ 14వ తేదీన ఆయన కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆయన మృతదేహం వద్ద అనుమానాస్పదంగా తిరగడం భారీ చర్చకు దారి తీసింది. ఇంతకు ఆ ఇద్దరు ఎవరనే వేటను మీడియా చేపట్టింది.

సాక్ష్యాలు నాశనం అంటూ
సుశాంత్ మరణించిన సమయంలో ఆయన గదిలోని సాక్ష్యాలను నాశనం చేశారనే ఆరోపణలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. క్రైమ్ సీన్‌లో పోలీసుల అనుమతి లేకుండా కొందరు ప్రవేశించారు. మరికొందరు లోనికి వచ్చి బ్యాగుల్లో వస్తువులు మోసుకెళ్లారనే విషయాలు మీడియా వీడియో కెమెరాలకు చిక్కాయి. అయితే ఆ వీడియోల్లో సుశాంత్ మృత దేహం చుట్టు ఉన్న ఇద్దరు మిస్టరీ వ్యక్తులు ఎవరనే ప్రశ్నలు ఇప్పుడు వెంటాడుతున్నాయి.

సుశాంత్ డెడ్‌బాడీ వద్ద నలుపు దుస్తుల్లో వ్యక్తి
సుశాంత్ మృతదేహం పక్కనే ఓ వ్యక్తి నలుపు రంగు దుస్తులు, తెల్లటి క్యాప్ ధరించిన వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. చేతిలో కొన్ని వస్తువులు కనిపించాయి. మరికొన్ని సార్లు ఏవో వస్తువుల కోసం వెతుకుతూ సుశాంత్ మృతదేహం పక్కనే కనిపించారు. అలాగే మృతదేహాన్ని తరలిస్తుండగా ఒక బ్యాగ్‌ను పట్టుకొని నలుపు దుస్తులు ధరించిన వ్యక్తి పారిపోతూ కనిపించారు. అయితే అలా అనుమానాలకు తావిచ్చే విధంగా ఎందుకు పరిగెత్తారు అనే విషయాన్ని రిపబ్లిక్ టీవీ తన కథనంలో ప్రశ్నించింది.

సుశాంత్ ఇంటిలో బ్లూ టీషర్టు యువతి
ఇక సుశాంత్ మృతదేహాన్ని తరలించే క్రమంలో ఉండగా.. పక్కనే నల్లటి ఛారలు ఉన్న బ్లూ టీషర్టు, స్లిప్లర్లు ధరించిన ఓ అమ్మాయి మిస్టరీగా కనిపించింది. ఆందోళనతో అటు ఇటూ పరుగులు పెడుతూ మీడియా కంటపడింది. పోలీసులను పట్టించుకోకుండా ఏదో బిజీగా తన పనిలో తాను ఉన్నట్టు, ముఖంమంతా ఆందోళనకరంగా మారింది. అలాగే పోలీసులను దాటేసుకొంటూ గేట్ బయటకు పరుగెత్తతూ కనిపించారు. అయితే ఆ అనుమానాస్పద అమ్మాయి ఎవరనే విషయాన్ని రిపబ్లిక్ టీవీ ప్రశ్నిస్తున్నది.

ఆ ఇద్దరు ఎవరనే విషయం బయటకు
అయితే ముంబై పోలీసుల దర్యాప్తులో ఇలాంటి వ్యక్తులు ఎవరనే విషయాన్ని పట్టించుకోలేదనే విమర్శ వినిస్తున్నది. ఈ ఇద్దరు వ్యక్తుల ఆచూకీని రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఆయన ఇంటి పనిమనిషి ఒకరు కాగా, మరో వ్యక్తి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి ప్రియురాలు జమీలా కల్‌కత్తావాలా అనే విషయం ప్రాథమిక విచారణలో బయటకు వచ్చింది.

షోవిక్ చక్రవర్తి గర్ల్‌ఫ్రెండ్
జూన్ 14వ తేదీన సుశాంత్ మృతదేహం తరలించే సమయంలో మిస్టరీ గర్ల్‌గా కనిపించిన అమ్మాయి జమీలా కల్‌కత్తావాలా అని నిర్దారణకు వచ్చారు. ఆ సమయంలో అలా అనుమానాస్పదంగా ఎందుకు కనిపించారు. ఎందుకు పరిగెత్తుతూ పారిపోయారు. ఆ సమయంలో ఎందుకు ఇంటికి వచ్చింది? సుశాంత్ మరణంతో విషాద ఛాయలు కనిపించకపోగా.. అనేక అనుమానాలు తన శరీర కదలిక్లలో కనిపించాయనే వాదన మీడియాలో వనిిపస్తన్నది.
Recommended Video

రియా, షోవిక్‌తోపాటు ఆ ఇద్దరిని కూడా
సుశాంత్ మరణం తర్వాత తన బ్యాంక్ అకౌంట్లలో జరిగిన అవకతవకల గురించి ఈడీ అధికారులు రియా చక్రవర్తిని, షోవిక్ చక్రవర్తిని పలుమార్లు ప్రశ్నించారు. అవసరమైతే మళ్లీ పిలిపించి వారిని విచారిస్తామని అధికారులు తెలిపారు. అయితే వారితోపాటు ఇప్పుడు సుశాంత్ మరణం తర్వాత ఈ ఇద్దరిని విచారించాల్సిన అవసరం ఉందనే మాటలు కూడా మీడియాలో భారీగా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











