సుశాంత్ మృతిని తట్టుకోలేక అభిమాని మృతి.. షాకింగ్‌గా సూసైడ్ నోట్‌

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అభిమానులను, సన్నిహితులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేస్తున్నది. సుశాంత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. యువ హీరో మరణాన్ని తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. అభిమాని రాసిన సూసైడ్ నోట్‌లో గుండెను పిండేసే విధంగా తన బాధను వ్యక్తం చేసి ఆత్మహత్య చేసుకోవడం సెన్సేషనల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Sushant Singh Rajput's Fan ఆత్మహత్య, సూసైడ్ నోట్ లో ఏం రాసాడో తెలుసా ?
అంత్యక్రియల రోజే వదిన మరణం

అంత్యక్రియల రోజే వదిన మరణం

జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త వెలుగు చూడగానే సినీలోకంతోపాటు ప్రేక్షక లోకం నివ్వెరపోయింది. తన మరణవార్తతో మనస్తాపం చెందిన ఆయన వదిన సుధాదేవి ఆహారం, మెడిసిన్స్ తీసుకోవడం మానేయడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించండం మరో విషాదంగా మారింది. ఈ విషాదం మరిచిపోకముందే మరో అభిమాని ప్రాణాలు తీసుకోవడం మరింత బాధగా మారింది.

యూపీలో అభిమాని మృతి

యూపీలో అభిమాని మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బరేలి గ్రామానికి చెందిన అభిమాని సుశాంత్ మరణంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. పదో తరగతి చదువుతున్న బాలుడు తాను అభిమానించే నటుడు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ బాధలో ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. బాలుడి మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది.

సూసైడ్ నోట్‌లో ఏం రాశారంటే..

సూసైడ్ నోట్‌లో ఏం రాశారంటే..

సుశాంత్ అభిమాని ఆత్మహత్యకు కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ రాశారు. మరణాంతరం పోలీసులు, కుటుంబ సభ్యులు ఆ సూసైడ్ నోటును స్వాధీనం చేసుకొన్నారు. సుశాంత్ చేసిన పని.. నేనెందుకు చేయకూడదు అంటూ తన సూసైడ్ లెటర్‌లో పేర్కోవడం ప్రతీ ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది.

మనస్తాపంతో సుశాంత్ ఆత్మహత్య

మనస్తాపంతో సుశాంత్ ఆత్మహత్య

బాలీవుడ్‌లో తనకు జరిగిన అన్యాయానికి మనస్తాపం చెందిన సుశాంత్ సింగ్ ముంబైలోని బంద్రా అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకోవడం సిని పరిశ్రమను కుదిపేసింది. ఆయన అంత్యక్రియలు సోమవారం జూన్ 15న ముంబైలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, ఇతర నటీనటులను ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X