సుశాంత్‌పై ప్రియురాలి దారుణాలు? మరణానికి ముందు నమ్మకమైన బాడీగార్డు తొలగింపు.. విచ్చలవిడిగా!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దర్యాప్తులో కొత్తరకం అలజడి మొదలైంది. బీహార్‌లోని పాట్నాలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆయన తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ అలియాస్ కేకే సింగ్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో బాలీవుడ్‌లోను, ముంబై పోలీసుల వర్గాల్లోను కలకలం మొదలైంది. ఇక రియాపై కేసు నమోదు కాగానే బాలీవుడ్‌లో కొన్ని వర్గాలు ఆమెకు అండగా నిలుస్తూ.. న్యాయ, చట్టపరమైన సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియా చేసిన పనులు, తన సోదరుడితో సుశాంత్ కలిసి ప్రారంభించిన కంపెనీలు ఆమెపై అనుమానాలు రేకెత్తే విధంగా మారుతున్నాయి. ఇక వివాదానికి సంబంధించిన ఆరోపణల వివరాల్లోకి వెళితే..

రియా చక్రవర్తి నివాసంలో అలజడి

రియా చక్రవర్తి నివాసంలో అలజడి

సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగానే ముంబైలోని రియా చక్రవర్తి నివాసంలో అలజడి మొదలైంది. వెంటనే పలువురు లాయర్లు తనను గట్టెక్కించేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఆర్థిక వ్యవహారాలు, అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తతున్న సమయంలో ఆడిటర్లను కూడా రంగంలోకి దించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్‌లోని ఓ వర్గం ఆమెకు సపోర్టుగా నిలిచినట్టు తెలుస్తున్నది.

 రియా వెనుక ఉంది ఎవరనే కోణంలో

రియా వెనుక ఉంది ఎవరనే కోణంలో

ఇక బీహార్‌లో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ సోమవారం కేసు నమోదు చేసినా ఆ విషయాన్ని బుధవారం మధ్యాహ్నానికి బయటకు రాకుండా ఓ వర్గం ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఎత్తుగడల వెనుక ఎవరున్నారనే విషయంపై మీడియా దృష్టిపెట్టింది. ఓ వర్గం పనేనంటూ జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.

నమ్మకమైన బాడీగార్డును తొలగిస్తూ

నమ్మకమైన బాడీగార్డును తొలగిస్తూ

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో రియా చక్రవర్తి అనుసరించిన విధానాలు, తీరు ఆమెపై అనుమానాలు రేకేత్తేలా చేస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు సుశాంత్‌కు నమ్మకస్తుడైన బాడీగార్డును మార్చి 8వ తేదీన రియా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా తనకంటూ ఎవరూ లేకుండా సుశాంత్‌ను ఒంటరివాడిని చేసేందుకు కుట్రలు పన్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 ఓవర్‌డోస్‌తో మెడిసిన్స్

ఓవర్‌డోస్‌తో మెడిసిన్స్

ఇక అంతేకాకుండా డిప్రెషన్ పేరుతో సుశాంత్‌కు మోతాదుకు మించి డ్రగ్స్ అందించినట్టు సమాచారం. ఓవర్‌డోస్ మెడిసిన్స్ అందించి మానసికంగా, శారీరకంగా ప్రయత్నం చేసేందుకు ప్లాన్ చేశారని సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తుండటం మరింత చర్చనీయాంశమవుతున్నది.

విచ్చలవిడిగా డబ్బు వినియోగం

విచ్చలవిడిగా డబ్బు వినియోగం

ఇక సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తి విచ్చలవిడిగా వాడుకొన్న డబ్బుపై దర్యాప్తు చేసే అవకాశాలు రెట్టింపు అయ్యాయి. సుశాంత్‌తో మొదలుపెట్టిన బిజినెస్ వ్యవహారాలపై పాట్నా పోలీసులు ఆరా తీసేందుకు ముంబై చేరుకొన్నారు. ఈ క్రమంలో సుశాంత్ అకౌంట్ల నుంచి ఎవరెవరికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని తెలుసుకోవడానికి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన స్టేట్‌మెంట్లు సేకరించారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
 సుశాంత్ కంపెనీల్లో రియా, సోదరుడి పాత్ర

సుశాంత్ కంపెనీల్లో రియా, సోదరుడి పాత్ర

సుశాంత్ తన ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తితో కలిసికొన్ని జాయింట్ వెంచర్స్ వ్యాపారాలను ప్రారంభించారు. ఈ కంపెనీలకు సుశాంత్ మాత్రమే పెట్టుబడిదారుడు కావడం గమనార్హం. షోవిక్ చక్రవర్తి, రియా ఆ కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X