twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరారీలోనే రియా చక్రవర్తి.. బీహార్ పోలీసులకు చిక్కిన సిద్ధార్థ్ పితాని

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి దర్యాప్తుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పాట్నాలో కేసు నమోదు చేసిన తర్వాత పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్‌తోపాటు ఇంటిలో ఉన్న స్నేహితుడు సిద్ధార్థ్ పితాని, రియా చక్రవర్తిపై బీహార్ పోలీసులు నిఘా పెట్టారు. దర్యాప్తకు హాజరుకాకుండా పరారీలో ఉన్న రియా కోసం, అలాగే హైదరాబాద్‌లో ఉంటున్న సిద్ధార్థ్‌ను ప్రశ్నించేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన అంశాలు మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి.

    సిద్దార్థ్ పితానిపై బీహార్ పోలీసులు దృష్టి

    సిద్దార్థ్ పితానిపై బీహార్ పోలీసులు దృష్టి

    సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు ఆధారంగా ముంబైలో బీహార్ పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. సుశాంత్‌ ఇంటిలో ఉన్న వారిని నిశితంగా ప్రశ్నిస్తున్నారు. జూన్ 14వ తేదీకి ముందు ఏం జరిగిందనే విషయాలను వారి నుంచి సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్‌తో ఇంటిలో దాదాపు ఏడాది కాలంగా ఉంటున్న సిద్ధార్థ్ పితానిపై బీహార్ పోలీసులు దృష్టిపెట్టారు.

    దిశ, సుశాంత్ మరణాల వెనుక గుట్టు

    దిశ, సుశాంత్ మరణాల వెనుక గుట్టు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మేనేజర్ దిశా సలియాన్ అనుమానాస్పద మరణాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం సిద్ధార్థ్ పితానికి తెలిసి ఉంటుందనే కోణంలో విచారణకు సిద్ధమవుతున్నారు. అయితే ముంబైలో పరిస్థితులు దారుణంగా మారడంతో సిద్ధార్థ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటన్నట్టు తెలుస్తున్నది.

    సిద్దార్థ్‌ను ఫోన్‌లో విచారణ

    సిద్దార్థ్‌ను ఫోన్‌లో విచారణ

    సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలకంగా మారిన సిద్ధార్థ్‌ను వ్యక్తిగతంగా కలుసుకోవడంలో విఫలమైన బీహార్ పోలీసులు ఆయనను ఫోన్ ద్వారా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఫోన్‌లో పలు ప్రశ్నలను సంధించిన అవసరమైన సమాచారాన్ని రికార్టు చేసినట్టు సమాచారం.

     పరారీలోనే రియా.. బీహార్ డీజీపీ

    పరారీలోనే రియా.. బీహార్ డీజీపీ

    ఇక బీహార్ పోలీసుల విచారణకు అందుబాటులో లేకుండా రియా చక్రవర్తి తప్పించుకు తిరుగుతున్నదని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పష్టం చేశారు. రియా ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాంమని ఆయన తెలిపారు. అవసరమైతే మరికొంత మంది సీనియర్ ఆఫీసర్లను ముంబైకి పంపుతామని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    సీబీఐ విచారణ అవసరమే..

    సీబీఐ విచారణ అవసరమే..

    ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ మరణం కేసులో నిజాలు బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమనే కోణంలో రాజకీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ముంబైలోని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసులు దర్యాప్తులో విఫలమైతే బీహార్ పోలీసులు సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలి అని అన్నారు.

    English summary
    Sushant Singh Rajput's roommate and friend Siddharth Pithani has spoken to the Bihar Police on call in the actor's death case on phone and is yet to record his statement in person
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X