For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్స్ లో సుశాంత్ చివరి సినిమా ..

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బేచారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దిల్ బేచారా ట్రైలర్ ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.ఆతరవాత విడుదలైన సినిమా కూడా అదే రేంజ్ లో విజయం సాధించింది. రికార్డుల మోతమోగించింది. హాలీవుడ్ చిత్రాలకే సాధ్యమైన రికార్డును దిల్ బేచారా అవలీలగా అందుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో ఈ చిత్రం ఏకంగా 95 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుందని హాట్ స్టార్ అధికారికంగా పేర్కొంది.

    ఇప్పటి వరకు ఓటీటీ చరిత్రలో ఏ సినిమా కాని వెబ్ సిరీస్ కాని ఈ స్థాయిలో వ్యూస్ ను దక్కించుకోలేదు. రాబోయే పదేళ్ల వరకు దిల్ బేచారా రికార్డు పదిలంగా ఉంటుందని సుశాంత్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈసినిమాలో సుశాంత్ కాలేజ్ స్టూడెంట్ గా నటించాడు. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. బరువు కూడా తగ్గాడు. దిల్ బేచారా సినిమా థియేటర్స్ లో విడుదలై ఉంటే మరింత వసూళ్లు రాబట్టేదని సుశాంత్ అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యం లో దిల్ బేచారా సినిమాను థియేటర్స్ లో విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు.

     Sushant Singh Rajputs last film Dil Bechara to release in theatres

    అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్ రీఓపెన్ అవుతున్న విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు. దిల్ బెచారా మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన ఇందూ కి జవానీ, టెనెట్, సూరజ్ పే మంగళ్ భరీ సినిమాలను కూడా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.

    English summary
    Dil bechara might get a theatrical release as the cinema halls are reopening across the country from October 15.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X