సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను తలుచుకొని కృతి సనన్ ఎమోషనల్.. వీడియో షేర్ చేసి..
దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను తలుచుకొని బాలీవుడ్ నటి కృతిసనన్ ఎమోషనల్ అయ్యారు. వారిద్దరు కలిసి నటించిన రాబ్తా చిత్రం జూన్ 9 తేదీకి నాలుగేళ్లు పూర్తి చేసుకొన్నది. రాబ్దా రిలీజ్‌ను గుర్తు చేసుకొని ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. ఈ సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశారు. ఆ సినిమా షూటింగు ఎంతో సరదాగా సాగిపోయిందంటూ పేర్కన్నారు.
సుశాంత్ సింగ్ గురించి ఎమోషనల్ అవుతూ కృతి సనన్ స్పందిస్తూ.. మానవ సంబంధాలను బలంగా నమ్ముతాను. మనుషులు పుట్టడానికే జన్మిస్తారనే విశ్వసిస్తాను. అలాంటిదే రాబ్తా చిత్రానికి సాక్ష్యం. సుశాంత్, డినో, మడోక్ ఫిల్మ్స్ కలిసిన తీరు ఇప్పటికీ మనసును ఉద్వేగానికి గురిచేస్తుంది. సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి... కానీ ప్రతీ సినిమా ఒక మధురానుభూతిని అందిస్తుంది. మన మధ్య ఏర్పడే కనెక్షన్స్ ఒకరినొకరి ఎమోషనల్‌గా మారుస్తాయి.

రాబ్తా చిత్రం నా హృదయానికి దగ్గర ఉండే చిత్రం. అది నా గుండెలో ఎప్పటికీ నిలిచిపోతుంది. రాబ్తా ఎప్పటికీ చెదిరిపోనే ఓ మంచి మధురస్మృతి అంటూ కృతిసనన్ కామెంట్ చేశారు.
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1: నేనొక్కడినే చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించిన కృతి సనన్ ఆ తర్వాత దోచేయ్.. దిల్ వాలే, హౌస్‌ఫుల్ 4, పానిపట్, అంగ్రేజీ మీడియం చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన మిమీ, హమ్ దో హమారే దో, బచ్చన్ పాండే, భేడియా, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.


Click it and Unblock the Notifications











