చనిపోవద్దని ఆ రోజు అభిమాని చెప్పిన మాటకు.. సుశాంత్ ఇచ్చిన సమాధానం.. కంటతడి పెట్టిస్తోంది

ఎంతో భవిష్యత్తు ఉన్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇంకా బాధిస్తూనే ఉంది. అతను మరణించి నిన్నటితో నెల రోజులయ్యింది. అయినా కూడా సుశాంత్ కి సంబంధించిన ఎదో ఒక వార్త అభిమానులను కలచివేస్తూనే ఉంది. సుశాంత్ సింగ్ కెరీర్ ఎలా ఉన్నా కూడా అతనికంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇక గతంలో ఒకసారి నువ్వు చనిపోవద్దు అంటూ ఒక అభిమాని కోరగా అందుకు సుశాంత్ మనసును తాకేలా ఒక సమాధానం కూడా ఇచ్చాడు.

 ఎంత బిజీగా ఉన్నా..

ఎంత బిజీగా ఉన్నా..

సుశాంత్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యాన్స్ కి మాత్రం అస్సలు దూరంగా ఉండేవాడు కాదు. లొకేషన్స్ లోకి ఫ్యాన్స్ వస్తే నో చెప్పకుండా వారికి సెల్ఫీలు ఇచ్చేవాడు. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ వారితో చిట్ చాట్ చేసేవాడు. వారు చెప్పిన సలహాలు తీసుకుంటూ అప్పుడప్పుడు మంచి మాటలతో వారిని ఉత్తేజపరిచే వాడు.

మీరు తొందరగా చాయిపోవద్దు..

మీరు తొందరగా చాయిపోవద్దు..

అయితే ఒక సందర్భంలో ఒక అభిమాని ఈ విధంగా కామెంట్ చేశాడు.. సర్ సర్..మీరు తొందరగా చనిపోవద్దు. ఇలాగే మంచి స్టఫ్ ఉన్న సినిమాలు చేసి నా లాంటి వాళ్ళని మోటివేట్ చేయండి. మీ లాంటి వాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు. కావున దయచేసి.. ఏదేమైనా విడిచిపెట్టకుండా అనుకున్నది సాదించండి. ఏ మాత్రం వదిలేయకండి అంటూ ఒక అభిమాని చెప్పిన విధానానికి సుశాంత్ వెంటనే ఆన్సర్ ఇచ్చాడు.

 తప్పకుండా అలానే చేస్తాను

తప్పకుండా అలానే చేస్తాను

అవును..తప్పకుండా అలానే చేస్తాను. నీ మాటలతో ఉత్తేజపరిచినందుకు చాలా కృతజ్ఞతలు. తొందరగా చనిపోవద్దు అని నువ్వు చెప్పిన విధానం నన్ను క్రాక్ గా తాకినట్లు చెబుతూ.. హ..హ.. అని సుశాంత్ నవ్వినట్లు కామెంట్ చేశాడు. అనంతరం సీతాకోకచిలుక, సుడిగాలి, స్టార్స్ అనే ఎమోజిస్ పెట్టి సుశాంత్ తన మనసులోని ఎదో భావాన్ని అక్కడ ఉంచే ప్రయత్నం చేశాడు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
 అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తా

అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తా

ఇక ఆ తరువాత మళ్ళీ ఆ అభిమాని మరో విదంగా స్పందించాడు. ఆ మాట నేను చాలా సరదాగా అన్నాను అంటూ. నేను చాట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని నేను మీ అంతరిక్ష కేంద్రంలో పని చేయబోతున్నాను, స్వీపర్ అయినా పరవాలేదని ఆ అభిమాని సుశాంత్ కళల గురించి వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఆ సంభాషణ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X