సుశాంత్ సూసైడ్‌లో ట్విస్ట్: మరణించిన మాజీ మేనేజర్‌తో 14 కోట్ల డీల్.. ఆ ఇద్దరి సాక్ష్యాలే కీలకం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సుశాంత్‌తో రెగ్యులర్‌గా వ్యవహారాలు జరిపే, టచ్‌లో ఉండే వారిపై ప్రాథమికంగా దృష్టిపెట్టారు. తాజాగా క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రాతోపాటు తొమ్మిది మందిని బుధవారం విచారించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని ముంబై పోలీసులు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే కాకుండా మీడియాకు వివరాలు అందిస్తున్నారు. గత రెండు రోజుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు ఏమిటంటే..

యాక్సిడెంటల్ నుంచి సూసైడ్‌గా
సుశాంత్ మరణం తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమికంగా యాక్సిండెటల్ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో వెలుగు చూస్తున్న వివరాలా ఆధారంగా ఈ కేసును బేరీజు వేస్తున్నారు. బాంద్రా పోలీసు స్టేషన్‌లో రిజిస్టర్ అయిన సుశాంత్ సూసైడ్ కేసును యాక్సిడెంటల్ కేసుగా మార్చినట్టు డీసీపీ ట్వీట్ చేశారు.

దిశ సలియాన్‌తో 14 కోట్ల డీల్
పలువురు మేనేజర్లను విచారించిన అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్‌కు తన మాజీ మేనేజర్ దిశా సలియాన్ కెరీర్ పరంగా సహకారం అందిస్తున్నారు. రూ.14 కోట్ల మేర రెమ్యునరేషన్‌తో ఓ వెబ్ సిరీస్‌లో లీడ్‌గా నటించేలా ఆమె ఓ డీల్‌పై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆమె జూన్ 18న సూసైడ్ చేసుకోవడంతో ఆ సంప్రదింపులు ఆగిపోయాయి అని పోలీసులు తెలిపారు.

దిశ మరణంతో మరింత డిప్రెషన్
మాజీ మేనేజర్ దిశా సలియాన్ సూసైడ్ వార్తతో సుశాంత్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆ దుర్వాత విన్న తర్వాత ఎవరితో మాట్లాడకుండానే ఏకాంతంలోనే ఉన్నారు. తన గదిలోకి వెళ్లి తాళం వేసుకొని ఉన్నారు. అప్పటికే డిప్రెషన్‌లో ఉన్న సుశాంత్.. దిశ మరణంతో మానసికంగా మరింత కుంగిపోయారు. ఆమె మరణం మరింత కుంగదీసింది అనే విషయం విచారణలో బయటకు వచ్చింది.

దిశా సలియాన్‌తో లావాదేవీలపై
వెబ్ సిరీస్ కోసం దిశ, సుశాంత్ మధ్య ఏమైనా లావాదేవీలు ఏమైనా జరిగాయా? అనే కోణంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమీ జరిగినట్టు ఆధారాలు లభించలేదు. దిశా, సుశాంత్ చివరిసారిగా మార్చిలో పలకరించుకొన్నారు. అది కూడా వాట్సప్‌లోనే జరిగిందని పోలీసులు తెలిపారు.
Recommended Video

శేఖర్ కపూర్, రియా చక్రవర్తి స్టేట్స్‌మెంట్స్ కీలకం
సుశాంత్ మరణం విషయంలో మా దృష్టికి వచ్చిన ఏ పాయింట్ వదిలిపెట్టడం లేదు. ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఇప్పటి వరకు 10కి పైగా స్టేట్‌మెంట్స్ రికార్డు చేశాం. కీలకమైన శేఖర్ కపూర్, రియా చక్రవర్తి స్టేట్‌మెంట్స్ కూడా తీసుకొంటాం. పోలీసుల దర్యాప్తులో ఆ ఇద్దరి వాగ్మూలాలు కీలకంగా మారుతాయి అనిి బాంద్రా పోలీసులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











