twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సిస్టర్స్ : 'ఆత్మహత్య' కాదంటూ ఒకరు, మన గర్వకారణం అంటూ మరొకరు!

    |

    దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల హృదయాల్లో ఇప్పటికీ నిలిచే ఉన్నారు. ఆయనని తరచుగా అభిమానులు సోషల్ మీడియాలో అతనిని రకరకాలుగా గుర్తుంచుకుంటారు. అయితే ఆయన ఇద్దరు సోదరీమణులు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టులు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
     గర్వ కారణం

    గర్వ కారణం

    ముందుగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి దివంగత నటుడి ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసి తమకు గర్వ కారణం అని అభివర్ణించారు. సుశాంత్ యొక్క అభిమానులు చేసిన ట్వీట్ ని శ్వేతా పంచుకున్నారు, దీనిలో సుశాంత్ వ్యోమగామి యూనిఫాంలో కనిపిస్తాడు. ఆ ఫోటో మీద 'వాస్తవానికి నాసా వ్యోమగామిగా శిక్షణ పొందిన ప్రపంచంలోని ఏకైక నటుడు'. ఇది మాత్రమే కాదు, 2024 యొక్క మూన్ మిషన్ కి కూడా వెళ్ళడానికి ఆయన సిద్ధం అయ్యారు. మా సుశాంత్, మా గర్వకారణం అని రాసి ఉంది.

     ఆ సినిమా కోసం

    ఆ సినిమా కోసం

    సుశాంత్ ఒక సైన్స్ చిత్రంలో కనిపించబోతున్నారని, దర్శకుడు సంజయ్ పురాన్ సింగ్ యొక్క సైన్స్ ఫిక్షన్ చిత్రం 'చందమామ డోర్ కే'లో సుశాంత్ కూడా నటించబోతున్నాడని గతంలో ప్రచారం జరిగింది. ఆ సినిమా సన్నాహాల కోసం సుశాంత్ నాసాకు వెళ్ళాడు. ఈ చిత్రం తర్వాత నిలిపివేయబడినప్పటికీ, సుశాంత్ ఆ కోర్సు పూర్తి చేయాలనుకున్నాడు. ఇక సుశాంత్ ఆకస్మిక మరణం తరువాత, ఈ సినిమా ఇప్పుడు నిర్మించబడుతుందని, ఇది సుశాంత్‌కు నివాళిగా ఉంటుందని సంజయ్ ప్రకటించారు.

    <strong>డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!</strong><br />డింపుల్ హయాతి అందాల విందు.. వంపు సొంపులు చూపుతూ కైపు ఎక్కిస్తోందిగా!

    వికీపీడియాలో తప్పుగా

    వికీపీడియాలో తప్పుగా

    ఇక మరో సోదరి ప్రియాంక సింగ్ సోమవారం ట్విట్టర్‌లో వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్, సహ వ్యవస్థాపకుడు లారీ సాంగర్ లను ట్యాగ్ చేస్తూ తన సోదరుడి మరణానికి కారణాన్ని వికీపీడియా సైట్‌లో మార్చాలని కోరారు. ఈ నివేదికను ప్రచురించే సమయంలో, వికీపీడియా నటుడి మరణాన్ని "ఉరి వేసుకుని ఆత్మహత్య" గా పేర్కొంది. వృత్తిపరంగా న్యాయవాదిగా ఉన్న ప్రియాంక, సుశాంత్ మరణం ఇంకా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో ఉందని, అందువల్ల దీనిని "దర్యాప్తులో" ఉందని పేర్కొనాలని చెప్పారు.

    చాలా గొప్ప విషయం

    చాలా గొప్ప విషయం

    "నేను సుశాంత్ సోదరిని ఎల్సాంగర్ గారు తటస్థతకు విశ్వసనీయమైన గొంతుగా ఉన్నందుకు ధన్యవాదాలు.. సమాచారం శక్తిగా ఉన్న నేటి ప్రపంచంలో వాస్తవాలకు కట్టుబడి ఉండడం చాలా గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఇక ఇలా వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండడం # జస్టిస్ ఫోర్ సుశాంత్ సింగ్ రాజ్ పుట్ కి చేయగలిగిన గొప్ప సేవ" అని ప్రియాంక సోమవారం ట్వీట్ చేశారు.

    కథను కెలుకొద్దని అనుకొన్నా.. ప్రియమణిని అందుకే తీసుకొన్నాం... అసురన్ రీమేక్ గురించి శ్రీకాంత్ అడ్డాల

    హైట్ చాలా ఇంపార్టెంట్

    హైట్ చాలా ఇంపార్టెంట్

    "వికీపీడియా జిమ్మీవాల్స్ కి నా డిమాండ్: సుశాంత్ మరణం కేసులో అత్యున్నత భారత ఏజెన్సీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కొనసాగుతున్నందున, వికీ పేజీలో ఉదహరించబడిన మరణానికి కారణాన్ని 'ఉరి వేసుకుని ఆత్మహత్య' నుండి 'విచారణలో ఉంది' అని మార్చాలి అంటూ ఆమె కోరారు. కొనసాగుతున్న దర్యాప్తుకు తన దివంగత సోదరుడి ఎత్తు చాలా కీలకమని, అతని అసలు ఎత్తును సైట్‌లో పేర్కొనాలని ప్రియాంక పేర్కొంది. "నేను అతని సోదరిని మరియు సుశాంత్ యొక్క ఎత్తు 183 సెం.మీ. అని నేను హామీ ఇస్తున్నాను. సుశాంత్ మరణ కేసు యొక్క దర్యాప్తుకు ఈ ఎత్తు చాలా ముఖ్యమైనది. అంటూ ప్రియాంక సుశాంత్ స్వయంగా హైట్ చెబుతున్న వీడియో పోస్ట్ చేసింది.

    English summary
    Priyanka Singh, sister of late Bollywood actor Sushant Singh Rajput, took to Twitter on Monday to urge Wikipedia founder Jimmy Wales and co-founder Larry Sanger to change the cause of his death as mentioned on the site. and Shweta Singh Kirti posted a photo in instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X