twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సూసైడ్: డొంక లాగుతున్న పోలీసులు.. ఆదిత్యా చోప్రాపై 4 గంటలు ప్రశ్నల వర్షం

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 40 రోజులుగా సాగుతున్న విచారణలో ఇప్పటికే 40 మందిని ఈ కేసులో విచారించారు. తాజాగా సుశాంత్ మరణానికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాను ముంబై పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్‌లో విచారించారు. అయితే ఆదిత్య విచారణ విషయం మీడియాలో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. బాంద్రా పీఎస్‌లో ఆదిత్య చోప్రా విచారణ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

    ఆదిత్యా చోప్రాపై పలు అనుమానాలు

    ఆదిత్యా చోప్రాపై పలు అనుమానాలు


    యష్ రాజ్ ఫిల్మ్స్‌లో రెండు సినిమాలు చేజారడం వల్లే సుశాంత్ సింగ్ డిప్రెషన్‌లోకి వెళ్లి మరణించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. కంగన, శేఖర్ సుమన్, తదితర ప్రముఖులంతా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే ఆదిత్యా చోప్రాను ముంబై పోలీసులు ఎందుకు ప్రశ్నించడం లేదు అనే అంశాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేశారు. దాంతో అనూహ్య పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు సమన్లు జారీ చేయకుండానే ఆదిత్యను శనివారం ఉదయం విచారణకు పిలిచారు.

    4 గంటలపాటు ప్రశ్నల వర్షం

    4 గంటలపాటు ప్రశ్నల వర్షం

    ముంబై పోలీసుల విచారణకు ఆదిత్య చోప్రా బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వచ్చారనే వార్త మీడియాలో హల్‌చల్ చేసింది. శనివారం మధ్యాహ్నం దాదాపు 4 గంటలపాటు ఆదిత్యను ప్రశ్నించినట్టు మీడియా కథనాలు వచ్చాయి. అయితే సుశాంత్‌తో దర్శకుడు శేఖర్ కపూర్ రూపొందించాలనుకొన్న పానీ చిత్రం ఎందుకు ఆగిపోయింది. సుశాంత్‌తో చేసుకొన్న అగ్రిమెంట్స్ గురించి పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తున్నది.

    యష్ రాజ్ ఫిలింస్ టీమ్‌ను కూడా

    యష్ రాజ్ ఫిలింస్ టీమ్‌ను కూడా


    గతంలో యష్ రాజ్ ఫిల్మ్స్‌కు సంబంధించిన క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ, సీనియర్ అధికారులు ఆశీష్ సింగ్, మాజీ వైస్ ప్రసిడెంట్ ఆశీష్ పాటిల్ను విచారించారు. వీరందరూ సుశాంత్‌తో మూడు ప్రాజెక్టుల కోసం యష్ రాజ్ ఫిలింస్‌ ఒప్పందం చేసుకొన్న సందర్భంంలో కీలకంగా వహించారు. అలాగే పానీ సినిమా రిజెక్ట్ చేయడంలో కూడా కీలకంగా వ్యవహరించారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    ఆదిత్య చోప్రా ఫోటోలు ఎందుకు తీయలేదంటూ

    ఆదిత్య చోప్రా ఫోటోలు ఎందుకు తీయలేదంటూ


    ఇదిలా ఉండగా, ఆదిత్య చోప్రా విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో ఎలాంటి ఫోటోలు ప్రధాన మీడియా ఎందుకు తీయలేదనే విషయం వివాదంగా మారింది. . ఆదిత్య చోప్రాను బయట వేరే ప్రదేశంలో ప్రశ్నించారా? ఆయన స్టేట్‌మెంట్‌ను ఎక్కడ రికార్డు చేశారు అనే ప్రశ్నలు సంధిస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ సందర్భంగా ఆదిత్యను తీసిన ఫోటోను ఉంటే షేర్ చేయండి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

    English summary
    Bollywood's Talent Manager Reshma Shetty questioned for 5 hours by Mumbai polices in Sushant Singh Rajput Suicide case. Till now, Bandra Police recorded 25 members statements in this case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X