సుశాంత్ సూసైడ్: సీక్రెట్‌గా ఆ దర్శకుడిని ప్రశ్నించిన పోలీసులు.. ఆ ట్వీట్‌లోనే అసలు ట్విస్టు

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు విచారణ ఎవరూ ఊహించనంతగా మలుపులు తిరుగుతూ జోరందుకుంది. ఈ కేసులో అనుమానిత వ్యక్తులకు సమన్లు జారీ చేసి బాంద్రా పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఇప్పటికే రియా చక్రవర్తి, సంజనా సంఘీ, సంజయ్ లీలా భన్సాలీతోపాటు యష్ రాజ్ ఫిలింస్, తదితర వ్యక్తులను పలు గంటలపాటు ప్రశ్నించి స్టేట్‌మెంట్స్ రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలకంగా మారిన ఓ దర్శకుడిని మీడియాకు తెలియకుండా ప్రశ్నించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకు ఆ దర్శకుడు ఎప్పుడు? ఎలాంటి సమాచారం అందించారంటే...

సుశాంత్‌తో శేఖర్ కపూర్ మూవీ

సుశాంత్‌తో శేఖర్ కపూర్ మూవీ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పానీ సినిమా తీయాలని సంచలన దర్శకుడు శేఖర్ కపూర్ ప్లాన్ చేశారు. ఆ క్రమంలోనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఆ సినిమా గురించి గ్రాండ్‌గా ప్రకటన చేశారు. అయితే అప్పటికే యష్ రాజ్ మూవీస్‌తో మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకొన్న సుశాంత్ సింగ్‌తో ఆ సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఆగిపోవడం వెనుక పలు కారణాలు వినిపించాయి.

సుశాంత్ మరణం తర్వాత ట్వీట్

సుశాంత్ మరణం తర్వాత ట్వీట్


సుశాంత్ సింగ్ మరణం తర్వాత శేఖర్ కపూర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నీవు ఎంత బాధను అనుభవిస్తున్నావనే సంగతి నాకు తెలుసు. నిన్ను ఎంత దారుణంగా అణిచివేయాలనే చూశారనే విషయం నా భుజాలపై తల పెట్టి ఏడ్చినప్పుడే ఆ విషయం నాకు తెలిసింది. ఆ ఆరు నెలలు నీతో ఉండాలని ప్రయత్నించాను. ఆ తర్వాత నా వద్దకు వస్తావని ఆశించాను. ఇప్పుడు జరిగింది నీ ఖర్మ కాదు.. వారి ఖర్మ అంటూ శేఖర్ కపూర్ నర్మగర్భంగా ట్వీట్ చేశారు.

ట్వీట్‌ను ఆధారంగా చేసుకొని

ట్వీట్‌ను ఆధారంగా చేసుకొని

శేఖర్ కపూర్ చేసిన ట్వీట్ సినీ వర్గాల్లోనే కాదు.. పోలీసుల వర్గాల్లోనే చర్చకు దారి తీసింది. ఆ ట్వీట్‌ను ఆధారంగా చేసుకొని శేఖర్ కపూర్‌ను విచారణకు పిలిచాం. అయితే ప్రస్తుతం ముంబైలో లేకుండా వేరే సిటీలో ఉన్నందున్న ప్రత్యక్షంగా విచారణకు హాజరుకాలేకపోతున్నాని చెప్పారు. మా ప్రశ్నలకు ఆయన ఈమెయిల్ ద్వారా సమాధానాలు పంపించారు అని తెలిపారు.

శేఖర్ కపూర్ ఈమెయిల్‌ను

శేఖర్ కపూర్ ఈమెయిల్‌ను

శేఖర్ కపూర్ ఈమెయిల్‌ను ప్రాథమికంగా కేసు విచారణకు పరిగణనలోకి తీసుకొంటున్నాం. ముంబైకి చేరుకోగానే బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ రికార్డు చేయడానికి సహకరించాలని కోరాం. అందుకు శేఖర్ కపూర్ సమ్మతించారు. ఇంకా చాలా విషయాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తాం అని ముంబైకి చెందిన సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
జూలై 24న దిల్ బేచారా

జూలై 24న దిల్ బేచారా

ఇది ఇలా ఉండగా, సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా హీరోయిన్ సంజన సంఘీని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆమె విచారణ అనంతరం ఇక ముంబైలో అడుగుపెట్టను. ఇక్కడి వారి వ్యవహారమంతా అగమ్యగోచరంగా, అనుమానస్పదంగా ఉంది అంటూ ముంబై ఎయిర్‌పోర్టు నుంచి ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇక దిల్ బేచారా చిత్రం డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీలో జూలై 24న ప్రీమియర్ ప్రదర్శన ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X