సుశాంత్ సోదరి వాట్సాప్ ఛాట్ లీక్.. మరణానికి ముందే ఆ విషయాలు తెలుసు అంటూ..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుకు సంబంధించిన విషయాల గురించి బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వస్తుననాయి. సుశాంత్ సింగ్ డిప్రెషన్‌పై విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ మీడియాకు చెందిన ఓ వెబ్‌సైట్ సుశాంత్ సోదరి నీతూ సింగ్ వాట్సాప్ ఛాట్‌ను బయటపెట్టింది. దీంతో సుశాంత్ డిప్రెషన్ వివాదం మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ వెబ్ ఛాట్ లీక్ గురించి మరింతగా వివరాల్లోకి వెళితే..

నీతూ సింగ్‌కు శృతిమోడీ వాట్సప్ ఛాట్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనారోగ్యం గురించి అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మేనేజర్ శృతిమోదీ, సుశాంత్ సోదరి నీతూ సింగ్‌కు మధ్య నవంబర్ 26వ తేదీన జరిగిన ఛాట్‌ను ఇండియా టుడే బయటపెట్టింది. సుశాంత్ అనారోగ్యం గురించి ఆమె సోదరికి ముందే తెలుసు అనే విషయాన్ని స్పష్టం చేసింది. సుశాంత్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు మాకు తెలియదని ఆయన కుటుంబం చెబుతున్న సమయంలో ఈ లీక్ వ్యవహారం చర్చనీయాంశమైంది.

డాక్టర్ ప్రిస్కిప్షన్ పంపించండి అంటూ
నవంబర్‌లో శృతి మోదీ, నీతూ సింగ్‌కు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. శృతి డాక్టర్ ప్రిస్కిప్షన్ పంపించండి అని నీతూ సింగ్ మెసేజ్ పంపారు. అందుకు బదులుగా కొద్ది నిమిషాల్లో మీకు పంపిస్తాను అంటూ జవాబు ఇచ్చారు. ఆ తర్వాత నాకు డాక్టర్‌ను కలిసి మాట్లాడే పని ఉంది. అతను వచ్చినప్పుడు నాకు చెప్పండి అంటే.. సరే అంటూ శృతిమోదీ రిప్లై ఇచ్చారు.

డాక్టర్ ఎప్పుడు వస్తారు అంటూ
సుశాంత్ ప్రిస్కిప్షన్ గురించి చాటింగ్ చేస్తూ.. డాక్టర్ ఏ సమయంలో వస్తారో నాకు కాస్త వివరాలు అందించండి అని నీతూ సింగ్ అడిగితే.. నేను తెలుసుకొని చెబుతాను అని శృతి మోదీ జవాబుచ్చింది. ఇక సుశాంత్‌కు డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్ గురించి వెల్లడిస్తూ.. సెర్టా, క్లోనోట్రిల్, ఓలియాంజ్, కుటిపిన్ లాంటి మందులు రాసినట్టు శృతిమోదీ తెలిపింది. అలాగే సుశాంత్‌కు వైద్యం చేసింది డాక్టర్ సుశాన్ వాకర్ సైకోథెరపీ అనే పేరును బయటపెట్టారు.
Recommended Video

రియాను నాలుగోసారి ప్రశ్నించనున్న సీబీఐ
సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ క్రమంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించారు. గత పది రోజులుగా సీబీఐ అనేక కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా, షోవిక్ చక్రవర్తి, నీరజ్ సింగ్, శ్యామ్యూల్, సిద్ధార్థ పితానిని పలురోజులుగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో రోజు (సోమవారం) కూడా రియా చక్రవర్తిని సీబీఐ ప్రశ్నించనున్నది.


Click it and Unblock the Notifications











