twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ ఉరి నిజమేనా? మెడ గాయాలపై పోలీసుల సందేహాలు.. అనుమానంతో మరో పరీక్ష!

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసుతో సంబంధమున్న పలువురిని విచారిస్తూనే ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన ఉరి వేసుకొన్న దుస్తులపై బాంద్రా పోలీసులు నజర్ పెట్టారు. ఆయన ధరించిన దుస్తులు ఉరివేసుకోవడానికి సహకరించాయా? అనే కోణంలో దర్యాప్తుకు తెర తీశారు. పోలీసుల్లో తలెత్తిన అనుమానాలకు కారణాలు ఏమింటంటే..

    మానసిక రుగ్మత గురై

    మానసిక రుగ్మత గురై

    సుశాంత్ మరణానికి కారణం మానసిక రుగ్మతనే కారణమనే వార్తలు మీడియాలో కనిపించాయి. కొందరు స్నేహితులు, స్నేహితురాళ్లు ఆయన ఆరు నెలల నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అంతేకాకుండా మెడిసిన్స్ కూడా వాడుతున్నారని చెప్పడం తెలిసిందే. అయితే సూసైడ్‌కు పాల్పడేంతగా డిప్రెషన్ ఏముంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    పలువురిపై ప్రశ్నల వర్షం

    పలువురిపై ప్రశ్నల వర్షం

    తాజాగా కొన్ని సినిమాలు ఆయన చేజారి పోయాయనే కారణాలు డిప్రెషన్ కారణమని తెలియడంతో యష్ రాజ్ ఫిలింస్ క్యాస్టింగ్ డైరెక్టర్, అలాగే మరికొందరు స్నేహితులపై ముంబై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ దర్యాప్తులో భాగంగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని జూలై 6వ తేదీన విచారణకు హాజరుకావాలని పోలీసులు సమన్లు జారీ చేశారు.

    ఫోరెన్సిక్, పోస్టు మార్టం రిపోర్టులపై

    ఫోరెన్సిక్, పోస్టు మార్టం రిపోర్టులపై

    జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెంటనే ఆయన పార్దీవ దేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం విసేరాలను ఫొరెన్సిక్ నిపుణుల బృందానికి పంపారు. ఈ రెండు పరీక్షల రిపోర్టుల్లో కూడా ఆయన మరణానికి కారణం శ్వాస ఆగిపోవడమే అని పేర్కొన్నారు. సుశాంత్ మరణం వెనుక మరో కారణం లేదని, విష ప్రయోగం లాంటిది జరుగలేదనే విషయాన్ని నిపుణులు స్పష్టం చేశారు.

    ఉరి వేసుకొన్న నైట్ గౌన్‌ను

    ఉరి వేసుకొన్న నైట్ గౌన్‌ను

    ఇలాంటి ఫలితాల నేపథ్యంలో ఉరి వేసుకొన్న బట్టలపై ముంబై పోలీసులు దృష్టిపెట్టారు. సీలింగ్‌కు ఉరి వేసుకొన్న కాటన్ నైట్ గౌన్‌ను ఇప్పుడు బరువు తట్టుకోగలదా అనే పరీక్ష కోసం నిపుణులకు పంపారు. సుశాంత్ సింగ్ 80 కేజీల బరువును ఆ కాటన్ నైట్ గౌన్‌కు భరించే శక్తి ఉందా అనే పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన రిపోర్టు మూడు రోజుల్లో రానున్నది అని సుశాంత్ తెలిపారు.

    Recommended Video

    Jiah Khan Mother Slams Salman Khan
    మెడపై గాయాలపై నివృత్తి చేసుకొనేందుకు

    మెడపై గాయాలపై నివృత్తి చేసుకొనేందుకు


    సుశాంత్ ఉరి వేసుకొన్న సమయంలో మెడ చుట్టు ఏర్పడిన మరకలు, గాయాలు కాటన్ నైట్ గౌన్ కారణంగానే ఏర్పడ్డాయా? లేక మరో వస్తువు వల్ల ఏర్పడ్డాయా? అసలు సుశాంత్ మరణానికి కారణం ఉరేనా? లేక మరే ప్రయత్నం జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఉరి వేసుకొన్న దుస్తులను ఫొరెన్సిక్ నిపుణులకు పంపడం సినీ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    English summary
    Sushant Singh Rajput Suicide: As part of the investigation, Mumbai police taken another step to know the foul play in Sushant death. Apart from that, Sushant Singh Rajput night gown sent to forensic lab for tensile strength.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X