సుశాంత్ సూసైడ్‌లో మరో ట్విస్టు.. ఉరి కుర్తాతో కాకుండా.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో వారం రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. దివంగత సినీ హీరోతో అనుబంధం, పరిచయాలు, సన్నిహితంగా వ్యవహరించిన వారిలో కొందరిని సుదీర్గంగా ప్రశ్నించడంతో ఈ కేసుకు మీడియాలో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత రెండు రోజుల్లో చోటచేసుకొన్న పరిణామాలు ఈ కేసులో కొన్ని సంఘటనలపై మరింత అనుమానాలను పెంచుతున్నాయి. అయితే సుశాంత్ మరణం విషయంలో రోజుకో కొత్త విషయం కేసును మలుపు తిప్పుతుంది. తాజాగా సుశాంత్ ఉరివేసుకొన్నది కుర్తా బట్టతో కాదనే విషయం తాజాగా పోలీసుల దృష్టికి రావడం షాకింగ్‌గా మారింది. అయితే సుశాంత్ దేనితో ఉరి వేసుకొన్నారనే విషయం సంచలనం రేపుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

#SushantSinghRajput : Sushant సూసైడ్‌లో కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు! || Oneindia Telugu
గత వారం రోజులుగా కీలక పరిణామాలు

గత వారం రోజులుగా కీలక పరిణామాలు

బాలీవుడ్‌పై గత వారం రోజులుగా పలు వర్గాలు ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేశాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తు అప్పగించాలనే డిమాండ్ తీవ్రతరం అయినట్టు కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టడానికి కర్ణిసేన ప్రయత్నించగా, బీజేపీ ఎంపీ, సీనియర్ నటి, మహాభారతంలో ద్రౌపది పాత్రధారి రూపా గంగూలీ అనేక అనుమానాలను లేవనెత్తారు.

యష్ రాజ్ ఫిలింస్ ప్రతినిధుల విచారణ

యష్ రాజ్ ఫిలింస్ ప్రతినిధుల విచారణ

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో సుశాంత్ కెరీర్‌లో కీలకంగా వ్యవహరించిన పలువురు వ్యక్తులను విచారించారు. గతంలో సుశాంత్‌తో యష్ రాజ్ ఫిలింస్ కాంట్రాక్టులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ప్రతినిధులు ఆశీష్ సింగ్, ఆశీష్ పాటిల్‌ను బాంద్రా పోలీసులు విచారించారు. ఈ ఇద్దరిలో యష్ రాజ్ ఫిలింస్ వైస్ ప్రసిడెంట్‌గా ఆశీష్ పాటిల్ వ్యవహరించగా, సీనియర్ అధికారిగా ఆశీష్ సింగ్ వ్యవహరించారు.

యువ హీరోలతో కాంట్రాక్టులపై ఆరా

యువ హీరోలతో కాంట్రాక్టులపై ఆరా


ఇదే క్రమంలో శనివారం యష్ రాజ్ ఫిలింస్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మను బాంద్రా పోలీసులు ప్రశ్నించారు. సుదీర్ఘంగా సాగిన విచారణలో యువ హీరోలతో ఎలా వ్యవహరిస్తారు. వారితో కాంట్రాక్టులు ఎలా చేసుకొంటారు? ఒకవేళ సినిమా నుంచి తప్పించాలనుకొంటే ఏ కారణాల వల్ల అలాంటి నిర్ణయాలు తీసుకొంటారనే కోణంలో షానూ శర్మను విచారించినట్టు తెలిసింది.

బెడ్ పక్కన రెండు ముక్కలుగా బెల్ట్

బెడ్ పక్కన రెండు ముక్కలుగా బెల్ట్

ఇక సుశాంత్ సూసైడ్ విచారణలో కొత్త విషయం సంచలన రేపుతున్నది. సుశాంత్ పడక పక్కన బెల్టుకు సంబంధించిన బెల్టు ముక్కలు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అయితే కుర్తా బట్టతో ఉరి వేసుకొనే ముందు బెల్టుతో తీవ్రమైన చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే ఫొరెన్సిక్ రిపోర్టు వచ్చేంత వరకు ఎలాంటి విషయాలు బయటకు వెల్లడించకూడదనే జాగ్రత్తలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.

వేలాడుతున్న దేహాన్ని కిందకు అలా

వేలాడుతున్న దేహాన్ని కిందకు అలా

సుశాంత్ మరణ వార్త బయటకు తెలిసిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం ఆయన సీలింగ్‌కు వేలాడుతూ కనిపించినట్టు ప్రాథమికంగా వెల్లడించారు. పోలీసుల సమక్షంలో కుర్తాను రెండు ముక్కలుగా కోసి సుశాంత్ దేహాన్ని కిందకు దించామనే విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు కుర్తాతో కాకుండా బెల్టుతో ఉరి వేసుకొన్నారా అనేది తెరపైకి వచ్చింది. దీంతో విచారణ కొత్త మలుపు తిరిగే అవకాశం కలిగింది.

కుర్తా కంటే ముందు బెల్ట్‌తో

కుర్తా కంటే ముందు బెల్ట్‌తో

అయితే సుశాంత్ మెడకు బిగించిన కుర్తా తాలూకు రెండు ముక్కలను కలినా ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి పంపించారు. సుశాంత్ బరువును మోసే కెపాసిటీ కుర్తాకు ఉందా అనే కోణంలో పోలీసులు దృష్టిపెట్టారు. ఇక జూన్ 15వ తేదీన సుశాంత్ మరణం తర్వాత గది తెలుపు తెరిచిన సమయంలో తన రూమ్‌లోని కప్ బోర్డులో ఇస్ట్రీ చేసిన బట్టలు చెల్లచెదురుగా పడి కనిపించాయి. బెల్ట్ రెండు ముక్కలై బెడ్ పక్కనే పడింది. ఇలాంటి అంశాలు సుశాంత్ మరణంపై మరింత అనుమానాలు పెంచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X