కంగన రనౌత్‌కు ముంబై పోలీసుల నోటీసులు.. సూసైడ్ గ్యాంగ్‌ ఆరోపణలపై దర్యాప్తు

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌పై తొలి రోజు అనుమానాలు వ్యక్తం సంచలన ప్రకటనలు చేస్తున్న ఫైర్ బ్రాండ్ యాక్టర్ కంగన రనౌత్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. సుశాంత్ సూసైడ్ వెనుక అసలు కారణాలు ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్న బాంద్రా పోలీసులు ఇప్పటి వరకు 40 మందికిపైగానే ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులు టెలివిజన్ లైవ్‌లో సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కంగనాను ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి పోలీసులు సిద్దమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

 సుశాంత్ కెరీర్‌ను నాశనం చేయాలని

సుశాంత్ కెరీర్‌ను నాశనం చేయాలని

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కెరీర్‌ను నాశనం చేయడానికి కొందరు బాలీవుడ్ ప్రముఖులు కంకణం కట్టుకొన్నారనే మొదటి నుంచి ఆరోపణలు కంగన రనౌత్‌ చేస్తున్నారు. తాజాగా మహేష్ భట్, కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా, జావెద్ అఖ్తర్ లాంటి ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. అసలు కుట్రదారులను విచారించకుండా ముంబై పోలీసులు మొక్కుబడిగా విచారణ చేస్తున్నారనే ఆరోపణల రావడం మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.

సూసైడ్ గ్యాంగే కారణం

సూసైడ్ గ్యాంగే కారణం

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ మరణానికి కారణం బాలీవుడ్‌లోని సూసైడ్ గ్యాంగే కారణం అంటూ మహేష్ భట్, కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా లాంటి ప్రముఖులను టార్గెట్ చేశారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్‌‌లో అర్నబ్ గోస్వామితో కంగన మాట్లాడుతూ పలు సంచలన విషయాలను బయటపెట్టారు. కంగన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

మాటల దాడిని పెంచిన కంగన

మాటల దాడిని పెంచిన కంగన

సుశాంత్ మరణించడానికి కారణం వారి పక్కా ప్రణాళికే అని తన మాటల దాడిని పెంచారు. సుశాంత్ నటించిన డ్రైవ్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నిర్మాతగా వ్యవహరించిన కరణ్ జోహర్ కుట్రపన్నారు. అలాగే భన్సాలీతో సినిమాలు తీయకుండా ఆదిత్య చోప్రా, కరణ్ కుట్రపన్నారనే ఆరోపణలను రిపబ్లిక్ టెలివిజన్ లైవ్‌లో వెల్లడించారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న సమాచారాన్ని రికార్డు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

నెపోటిజం కారణంగానే అంటూ

నెపోటిజం కారణంగానే అంటూ

బాలీవుడ్‌లోని కొందరు పెద్లలు సుశాంత్‌ను మానసికంగా క్షోభకు గురిచేశారు. హిందీ చిత్రసీమలో పేరుకుపోయిన బంధుప్రీతి, తన వర్గం వారినే ప్రోత్సాహించాలనే ఓ మాఫియా సుశాంత్‌ను పలుమార్లు అవమానించారు. సుశాంత్ ఓ ఫ్లాప్ హీరో అంటూ కరణ్ జోహర్ బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు అని కంగన ఆరోణపణలు చేసింది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
మనాలిలో కంగన రనౌత్

మనాలిలో కంగన రనౌత్

ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో కంగన రనౌత్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఆమె తన సొంత పట్టణం మనాలీలో ఉంటున్నారు. ఒకవేళ తనకు నోటీసులు జారీ చేస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ముంబైకి రావడానికి కుదరని పక్షంలో ముంబై పోలీసులు మనాలికి వస్తే తన స్టేట్‌మెంట్‌ను ఇస్తాను అని కంగన స్పష్టం చేశారు. అయితే ముంబైకి వచ్చిన సమయంలో పోలీసుల విచారణకు హాజరవుతున్నాని వెల్లడించినట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X