సుశాంత్ సూసైడ్: మహేష్‌భట్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం.. కంగన ప్లాన్ వర్కవుట్!

యువ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులు, నెటిజన్లు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుండటంతో ముంబై పోలీసుల దర్యాప్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈ కేసుపై అనేక కథనాలు, డిబేట్లు చేస్తూ విచారణపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల బాలీవుడ్ దిగ్గజాలను ప్రశ్నించడం ఈ కేసు విచారణ ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Sushant Singh Rajput: Mahesh Bhatt records his statement with Mumbai Police
సూసైడ్ గ్యాంగ్ కారణంగానే అంటూ కంగన

సూసైడ్ గ్యాంగ్ కారణంగానే అంటూ కంగన

ప్రముఖ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ టీవీతో ఇటీవల కంగన రనౌత్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో కొందరు ప్రముఖులు ప్రతిభావంతులను సూసైడ్ చేసుకొనేలా కుట్రలు చేస్తున్నారు. సినీ పరిశ్రమకు సంబంధం లేని ఫ్యామిలీల నుంచి హీరోలు, ఆర్టిస్టులు వస్తే వారికి అవకాశాల లభించకుండా అడ్డుకొంటున్నారు. కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్ తదితరులను సూసైడ్ గ్యాంగ్ అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కేసులో వీరిని ఎందుకు ముంబై పోలీసులు విచారించడం లేదు అని ప్రశ్నించారు.

మహేష్ భట్‌కు నోటీసులు జారీ

మహేష్ భట్‌కు నోటీసులు జారీ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు దర్యాప్తుపై కొన్ని వర్గాలు తమ గొంతును బలంగా వినిపిస్తున్న క్రమంలో ముంబై పోలీసులు తమ విచారణ విషయంలో వేగం పెంచారు. హడావిడిగా ఆదిత్య చోప్రాను వెంటనే విచారించారు. అలాగే మహేష్ భట్, కరణ్ జోహర్ బృందాన్ని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మహరాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా స్పందించి ఆ వార్తను ధృవీకరించారు.

మూడు గంటల సేపు మహేష్ భట్‌ను ప్రశ్నలతో

మూడు గంటల సేపు మహేష్ భట్‌ను ప్రశ్నలతో

ముంబై పోలీసులు జారీ చేసిన నోటీసులకు స్పందించిన దర్శకుడు మహేష్ భట్ సోమవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. జూలై 27వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు ఆయన చేరుకొన్నారు. దాదాపు మూడు గంటలసేపు మహేష్ భట్‌ను ముంబై పోలీసులు విచారించారు. పోలీసుల విచారణ అనంతరం 2.30 గంటల తర్వాత శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తూ మీడియాకు కనిపించారు.

త్వరలోనే కరణ్ జోహర్ బృందాన్ని విచారణకు

త్వరలోనే కరణ్ జోహర్ బృందాన్ని విచారణకు

ఇప్పటి వరకు సుశాంత్ సూసైడ్ కేసులో 45 మంది బాలీవుడ్ ప్రముఖులను, సాంకేతిక నిపుణులను ప్రశ్నించారు. కంగన ఆరోపణల తర్వాత యష్ రాజ్‌ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాను వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో విచారించి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ కేసులో ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్‌ బృందాన్ని త్వరలోనే విచారించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X