సుశాంత్‌ కేసులో కొత్త ట్విస్టులు.. కరణ్ జోహర్‌కు షాక్.. పోలీసుల చేతికి తాజా పోస్ట్ మార్టం రిపోర్టు

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. మహేష్‌ భట్‌ను మూడు గంటలపాటు ప్రశ్నించడంతోపాటు కరణ్ జోహర్‌కు నోటీసులు పంపించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా విసేరాకు సంబంధించి పోస్టు మార్టం రిపోర్టులు పోలీసులకు అందడం సంచలన అంశాలుగా మారాయి. జూలై 27వ తేదీన చోటుచేసుకొన్న సంఘటనల విషయాలు మరిన్ని వివరాలు..

రియా కారణంగానే సుశాంత్‌తో పరిచయం

రియా కారణంగానే సుశాంత్‌తో పరిచయం

ముంబై పోలీసుల దర్యాప్తులో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. మహేష్ భట్‌ను మూడు గంటలపాటు శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు. 2018లో తాను రూపొందించిన జలేబి చిత్రంలో నటించింది. తనతో సన్నిహిత సంబంధాలు ఉన్న రియా చక్రవర్తి కారణంగానే సుశాంత్ పరిచయమని మహేష్ భట్ విచారణలో పేర్కొన్నట్టు సమాచారం.

సడక్‌2 సినిమాకు ఆఫర్

సడక్‌2 సినిమాకు ఆఫర్

తాను రూపొందించిన సడక్ 2 సినిమాలో సుశాంత్‌కు ఆఫర్ ఇవ్వలేదు. ఆ సినిమాలో సుశాంత్‌కు పాత్ర ఇవ్వాలనే ఆలోచన, చర్చ కూడా మా మధ్య రాలేదు ఆయనకు సడక్ 2 సినిమా నుంచి తప్పించినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. కానీ సుశాంత్‌కు తనతో పనిచేయాలనే కోరిక ఉండేది అని మహేష్ భట్ తెలిపినట్టు సమాచారం.

తాజాగా విసేరా రిపోర్టు

తాజాగా విసేరా రిపోర్టు

ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన విసేరా రిపోర్టులను ముంబై పోలీసులు అందుకొన్నారు. ఆయన మరణానికి ఎలాంటి కుట్ర జరుగలేదనే విషయం ఈ కేసులో కీలకంగా భావించే రిపోర్టు వెల్లడించింది. ఆయనకు ఊపిరి అందకపోవడం వల్లే మరణించారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.

మరో రిపోర్టు కోసం ముంబై పోలీసులు

మరో రిపోర్టు కోసం ముంబై పోలీసులు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ పోస్ట్ మార్టమ్ రిపోర్టులకు సంబంధించిన మరికొన్ని నివేదికలు ఇంకా అందాల్సి ఉందని ముంబై పోలీసులు తెలిపారు. ముంబైలోని కలీనాలో ఓ ల్యాబ్ నుంచి మరో రిపోర్టు రావాల్సి ఉంది. ఆ రిపోర్టులో ఎలాంటి కుట్ర ఏదైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు బృందం పరిశీలిస్తున్నది.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
కరణ్ జోహర్‌కు నోటీసులు

కరణ్ జోహర్‌కు నోటీసులు


ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌ దర్యాప్తులో భాగంగా దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌కు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఈ కేసును మరింత సీరియస్‌గా విచారించేందుకు పోలీసులు అడుగులేస్తున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో కరణ్ జోహర్‌ను విచారించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఈ కేసును సిబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కరణ్ జోహర్ ప్రశ్నించే అంశం మరింత కీలకంగా మారే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X