సుశాంత్ కేసులో మరో ట్విస్టు.. సంజయ్ లీలా భన్సాలీకి పోలీసుల ఝలక్.. ఆమెను కూడా రెండోసారి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో రోజు రోజుకు అనేక విషయాలు చేరుతూ కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటికే 28 మందిని విచారించిన ముంబై పోలీసులు తమ విచారణను గురువారం మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఓ సారి విచారించిన యష్ రాజ్ ఫిలింస్ క్యాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మను, అలాగే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని విచారణకు పిలువడం సినీ వర్గాలను కుదిపేసింది. భన్సాలీ విచారణకు ఎందుకు పిలిచారంటే..

బంధుప్రీతి, గ్రూపిజం ఆరోపణలతో
సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి, గ్రూపిజం, మాఫియా లాంటి వార్తలు ఊపందుకొన్నాయి. ఓ గ్రూపు మాఫియాల వ్యవహరించి సుశాంత్ చేయాల్సిన ఆరు సినిమాలను ఆయన చేయకుండా అడ్డుకొన్నారనే వార్తలు మీడియాలో కనిపించాయి. ఆరు సినిమాలు చేతిలో నుంచి చేజారడం వల్ల సుశాంత్ డిప్రెషన్‌కు గురయ్యాడు. ఆ కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకొన్నారనే వార్తలకు బలం కలిగించేలా కథనాలు వచ్చాయి.

రామ్‌లీలా మూవీ నుంచి తప్పించి
గతంలో ఓ సినిమాను సుశాంత్‌తో రూపొందించేందుకు సంజయ్ లీలా భన్సాలీ ప్లాన్ చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా సుశాంత్‌ను తప్పించి రణ్‌వీర్ సింగ్‌తో తీశారు. ఆ సంఘటన సుశాంత్‌ను తీవ్రంగా కలిచి వేసింది. సుశాంత్‌ను బాలీవుడ్‌లో ఎదగనీయకుండా జరిగిన కుట్రల్లో సంజయ్ లీలా భన్సాలీ హస్తం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో, పలువురు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

రెండోసారి సుశాంత్‌ను అలా తప్పించి..
అలాగే సుశాంత్‌కు రెండోసారి కూడా సంజయ్ లీలా భన్సాలీ నుంచి చేదు అనుభవం ఎదురైందనే వార్త మీడియాలో ఉంది. బాజీరావు మస్తానీ సినిమా కోసం సుశాంత్‌తో సంప్రదింపులు జరిపారు. అయితే ఎందుకో తెలియని కారణంగా సుశాంత్‌ను ఆ సినిమా నుంచి కూడా తప్పించారు. అలా బాలీవుడ్‌లో హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ మూవీ నుంచి కూడా అనూహ్యంగా తీసేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి కారణాల వెనుకు బాలీవుడ్ బడా నిర్మాత, దర్శకులు హస్తముందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కోణంలోనే భన్సాలీని పోలీసులు విచారించే అవకాశం ఉంది.

షాను శర్మను రెండోసారి విచారణకు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో యష్ రాజ్ ఫిలింస్‌కు మధ్య మూడు సినిమాల కాంట్రాక్టు జరిగింది. అందులో శుద్ద్ దేశీ రొమాన్స్, డిటెక్టివ్ బ్యోమకేష్ భక్షి చిత్రాల కోసం సుశాంత్‌తో కలిసి షాను శర్మ పనిచేశారు. మూడో చిత్రం శేఖర్ కపూర్‌తో చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. శేఖర్ కపూర్‌తో తీయాల్సిన సినిమా రద్దు కావడం కూడా ఏదో కుట్ర జరిగందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో షాను శర్మను రెండోసారి కూడా విచారించాలని బాంద్రా పోలీసులు సమన్లు పంపారు.
Recommended Video

శేఖర్ కపూర్ విచారణ కూడా కీలకంగా మారే...
ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విచారణలో శేఖర్ కపూర్ విచారణ కూడా కీలకంగా కానున్నది. సుశాంత్ మరణాంతరం శేఖర్ కపూర్ చేసిన ట్వీట్ మీడియాలో సంచలనం రేపింది. సుశాంత్‌తో పానీ సినిమా తీయలేకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఆ తర్వాతనే సుశాంత్ మానసికంగా క్షోభకు గురయ్యాడు అనే విధంగా శేఖర్ కపూర్ వ్యాఖ్యలు చేశాయి. అదే మాదిరిగా బంధుప్రీతిపై కంగన రనౌత్ కూడా సంచలన ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











