twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సింగ్ సూసైడ్.. సల్మాన్‌పై భారీగా రూమర్లు.. ముంబై పోలీసుల క్లారిటీ

    |

    యువ సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొన్నారనే విషయం దేశవ్యాప్తంగా అభిమానులను, ప్రేక్షకులను, ప్రముఖులను కదలించింది. సుశాంత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ లాంటి బంధుప్రీతి, ఫేవరటిజం వల్లే సుశాంత్ డిప్రెషన్‌కు గురయ్యారని, ఆ కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిందనే విమర్శలు వచ్చాయి. ఆ క్రమంలో సుశాంత్ సూసైడ్‌‌కు కారణాలు ఏమై ఉంటాయా అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన ఓ విషయం మీడియాలో సంచలనం రేపింది. ఆ వివారాల్లోకి వెళితే..

    జూన్ 14 తర్వాత భన్సాలీ, రియా చక్రవర్తి

    జూన్ 14 తర్వాత భన్సాలీ, రియా చక్రవర్తి


    జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ సూసైడ్ తర్వాత ముంబై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సంజయ్ లీలా భన్సాలీ, రియా చక్రవర్తి, ముఖేష్ చాబ్రా, సంజనా సంఘీ, షాను శర్మ లాంటి సినీ ప్రముఖులను ప్రశ్నించి వారి వాగ్మూలాలను రికార్డు చేశారు. ఈ కేసులో దాదాపు 35 మందిని విచారించారు.

    సల్మాన్ ఖాన్ మేనేజర్‌ను విచారించిన..

    సల్మాన్ ఖాన్ మేనేజర్‌ను విచారించిన..

    సుశాంత్ కేసు దర్యాప్తులో భాగంగా సల్మాన్ ఖాన్ మేనేజర్ రేష్మా శర్మను ముంబై పోలీసులు ఇటీవల విచారించారు. దాంతో ఈ కేసులో సల్మాన్ ఖాన్‌ను కూడా విచారించనున్నారనే వార్త గత రెండు రోజులుగా మీడియాలో వైరల్ అయింది. సల్మాన్ విచారిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై జాతీయ మీడియా కథనాలను కూడా ప్రచురించడంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు.

    సల్మాన్ హస్తం ఉందనే ఆరోపణలు

    సల్మాన్ హస్తం ఉందనే ఆరోపణలు

    తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక హస్తం సల్మాన్ ఖాన్‌‌కు ఉందనే ఆరోపణలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. సుశాంత్ మరణానికి కారణం సూరజ్ పంచోలి అనే మరో వాదన తెరపైకి వచ్చింది. ఇలా రకరకాల ఆరోపణలతో ప్రతీ రోజు సోషల్ మీడియాలో సీబీఐ దర్యాప్తు అవసరమనే డిమాండ్ ట్విట్టర్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నది.

    సల్మాన్‌ను కూడా విచారిస్తారని

    సల్మాన్‌ను కూడా విచారిస్తారని

    సుశాంత్ మరణం తర్వాత ఊపందుకొన్న ఊహగానాలు, ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ కూడా విచారించే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపించాయి. దాంతో ముంబై పోలీసులు తమ దర్యాప్తుపై క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌ను ప్రశ్నించడం లేదనే విషయంపై స్పష్టత ఇచ్చారు. సల్మాన్ విచారించే అంశం కేవలం మీడియా ఊహగానాలే అని పేర్కొన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    సీబీఐ విచారణపై అమిత్ షా రియాక్షన్

    సీబీఐ విచారణపై అమిత్ షా రియాక్షన్

    ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నది. రూపా గంగూలీ, సుబ్రమణ్యస్వామి లాంటి ఎంపీలు, పప్పు యాదవ్ లాంటి బీహార్ రాజకీయ నేత, శేఖర్ సుమన్ లాంటి సినీ ప్రముఖులు బహిరంగంగానే తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలో సిబీఐ దర్యాప్తు చేయాలని పప్పు యాదవ్ చేసిన రిక్వెస్ట్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. సీబీఐ వ్యవహారం తన శాఖ పరిధిలో లేదు. డీవోపీటీ పరిధిలో ఉందని, దానికి సిఫారసు చేస్తున్నాను అని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.

    English summary
    Actor Sushant Singh Rajput Suicide case is going with twist and turns. Repots suggest that, Salman Khan will also be summoned and questioned by Mumbai Police. But Police said that Salman Khan won't be interrogated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X