సుశాంత్ కేసులో ‘మిస్టరీ గర్ల్’ గుట్టురట్టు.. రియా అరెస్ట్‌పై అధికారుల క్లారిటీ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సీబీఐ కూడా తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో శనివారం పలువురు అనుమానితులను గంటలపాటు విచారించింది. సీబీఐ ప్రశ్నించిన వారిలో సుశాంత్ కుటుంబ స్నేహితురాలు స్మితా పారిఖ్, సందీప్ సింగ్, మరో మిస్టరీ గర్ల్‌ను సీబీఐ విచారించినట్టు సమాచారం. ఈ కేసు విచారణలో శనివారం జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయి.
Recommended Video

సుశాంత్ మరణం రోజున మిస్టరీ గర్ల్
సుశాంత్ మరణం రోజున అతడి ఇంటిలో హడావిడిగా తిరిగిన మిస్టరీ గర్ల్ వ్యవహారం మీడియాలో హల్‌చల్ రేపింది. సందీప్ సింగ్‌తోపాటు ఆ మిస్టరీ గర్ల్‌ను కూడా సీబీఐ విచారించినట్టు సమాచారం. వీరితో పాటు సుశాంత్ క్లోజ్ ఫ్రెండ్ మహేష్ శెట్టిని కూడా విచారించినట్టు ఓ వార్త బయటకు వచ్చింది.

మిస్టరీ గర్ల్‌ను ప్రశ్నించారు...
ముంబైలోని డీఆర్డీవో గెస్ట్‌హౌస్‌లో జరిగిన విచారణ అనంతరం సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ మీడియాతో మాట్లాడారు. సందీప్ సింగ్, మిస్టరీ గర్ల్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే మళ్లీ విచారణకు హాజరు కావాలని చెప్పలేదు. ఒకవేళ వారు సమన్లు జారీ చేస్తే వెళ్తాను అని స్మితా పారిఖ్ తెలిపారు.

సందీప్ సింగ్ అనుమానాస్పద తీరుపై
సుశాంత్ మరణించిన రోజున ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం కూపర్ హాస్పిటల్‌కు తరలించే ప్రక్రియలో సందీప్ సింగ్ చురుకుగా వ్యవహారించారు. కూపర్ హాస్పిటల్‌లో అనుమానాస్పద తీరుతో వ్యవహరించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుశాంత్‌కు తాను స్నేహితుడని చెప్పుకొనే సందీప్ సింగ్‌పై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రియా అరెస్ట్‌పై ఎన్సీపీ అధికారుల ఇలా
ఇదిలా ఉండగా, షోవిక్ చక్రవర్తి, శ్యామూల్ మిరాండా తర్వాత సుశాంత్ సిబ్బందిలో ఒకరైన దీపేశ్ సావంత్‌ను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రియాను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా అని అడిగిన ప్రశ్నకు ఎన్సీబీ అధికారులు సమాధానం ఇస్తూ.. ఛాన్స్ ప్రకారం అరెస్ట్ చేయం. బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప అరెస్ట్ చేయడానికి ముందుకు వెళ్తాం అని అన్నారు.

రియాను ఆదివారం ప్రశ్నించే అవకాశం
షోవిక్ చక్రవర్తి, శ్యామూల్ మిరాండా, దీపేశ్ సావంత్ అరెస్ట్ తర్వాత రియా చక్రవర్తిని కూడా విచారించేందుకు నార్కోటిక్స్ అధికారులు సిద్దమవుతున్నారు. రియాకు సమన్లు జారీ ఆదివారం విచారణకు పిలిచే అవకాశం ఉందనే సంకేతాలను అధికారులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రియా విచారణ మీడియాలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నది.


Click it and Unblock the Notifications











