నేడు సుశాంత్ సింగ్ మరణం.. గతవారం ఆయన మాజీ మేనేజర్.. ఎన్నో అనుమానాలు?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న సుశాంత్ మరణం ఊహించని షాక్ ఇచ్చింది. గతవారం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ మరణించడం ఎన్నో అనుమానాలకు దారి తీసింది. అయితే ఊహించని విధంగా ఇప్పుడు సుశాంత్ మరణించడం కూడా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

టెలివిజన్ యాక్టర్‌గా మొదలుపెట్టి
సుశాంత్ కెరీర్ టెలివిజన్ యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా ప్రారంభమైంది. స్టార్ ప్లస్‌లో కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే రొమాంటిక్ డ్రామాగా రూపొందిన సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభమైంది. జీటీవీలో పవిత్ర రిస్తా అనే సీరియల్ ద్వారా గుర్తింపు పొందారు. ఆ తర్వాత అంచెలంచెలుగా కెరీర్ మొదలైంది.

బాలీవుడ్ ఎంట్రీ ఇలా
ఇక కాయ్ పోచే అనే చిత్రంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత శుద్ద్ దేశీ రొమాన్స్ అనే చిత్రంలో రొమాంటిక్ హీరోగా మంచి పేరు సంపాదించుకొన్ారు. ఆ తర్వాత వచ్చిన డిటెక్టివ్ బ్యోమేకేష్ బక్షి చిత్రం హీరోగా గుర్తింపు నర్చింది. ఇక ధోని బయోపిక్‌తో స్టార్ హీరో స్థాయిని సొంతం చేసుకొన్నారు.

సుశాంత్ సింగ్ కెరీర్‌లో చేసిన సినిమాలు
సుశాంత్ కెరీర్‌లో ఇప్పటి వరకు కాయ్ చే, శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి, ఎంఎస్ ధోని, రబ్దా, వెల్కమ్ టు న్యూయార్క్, కేదారినాథ్, సౌచారియా, చిచ్చోర్, డ్రైవ్ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన దిల్ బేచారా చిత్రం ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.

గతంలో మేనేజర్‌గా పనిచేసిన దిశ మృతి
ఇదిలా ఉండగా, సుశాంత్ రాజ్‌పుత్ సింగ్‌కు మేనేజర్‌గా గతంలో పనిచేసిన దిశా సలియాన్ మరణించడం షాక్ గురిచేసింది. దిశ ముంబైలోని మలాడ్‌లోని 14 అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమెను స్థానిక బోరివాలి హస్పిటల్‌కు వెంటనే తరస్తుండగా మరణించారని వైద్యులు ధృవీకరించారు. దాంతో ఆమె జీవితం విషాదంగా అర్ధాంతరంగా ముగిసింది.
Recommended Video

బాలీవుడ్‌లో షాక్‌లో దిశ, సుశాంత్ మరణాలు
బాలీవుడ్‌లో దిశా సలియాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాలు షాక్ గురిచేసాయి. దిశ మరణించిన కొద్దిరోజులకే, సుశాంత్ మరణించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. వీరిద్దరి మరణాలు మిస్టరీగానే మారాయి. తన కాబోయే భర్త వెంట ఉండగానే దిశ మరణించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











