twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముంబై పోలీసుల చేతికి సుశాంత్ ఫైనల్ పోస్టుమార్టం.. వెలుగులోకి సంచలన విషయాలు

    |

    యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన మృతికి సంబంధించిన ఫైనల్ పోస్టు మార్టం రిపోర్టు పోలీసులకు అందింది. ఇప్పటికే కూపర్ హాస్పిటల్ వైద్యులు ప్రాథమికంగా పోస్టుమార్టం రిపోర్టు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కూపర్ హాస్పిటల్‌ వైద్యులు బాంద్రా పోలీసులకు పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. ఫైనల్ పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

    Recommended Video

    Sushant Singh Rajput : ముంబై పోలీసుల చేతికి Sushant పోస్ట్‌మార్టం తుది నివేదిక...ఏం తేల్చిందంటే..?
    లోతైన దర్యాప్తు కోసం పోలీసుల లేఖ

    లోతైన దర్యాప్తు కోసం పోలీసుల లేఖ

    సుశాంత్ మృతికి సంబంధించి విసేరా ఆధారంగా రూపొందించే పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఆ నివేదికన అత్యవసర రిపోర్టుగా భావించి వెంటనే సమర్పించాలని మహారాష్ట్ర ఫొరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు ముంబై పోలీసులు లేఖ రాశారు. తుది పోస్టు రిపోర్టు ఆధారంగా సుశాంత్ మరణంపై లోతైన దర్యాప్తు చేపట్టనున్నట్టు, విచారణ విషయంలో ముందుకు వెళ్లనున్నట్టు పోలీసులు లేఖలో పేర్కొన్నారు.

    కూపర్ హాస్పిటల్ వైద్యుల బృందం అధ్యయనం

    కూపర్ హాస్పిటల్ వైద్యుల బృందం అధ్యయనం

    ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కూపర్ హాస్పిటల్‌కు చెందిన ఐదుగురు వైద్యులతో కూడిన బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. సోమవారం తమ ఫైనల్ రిపోర్టు పోలీసులకు అందజేశారు. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరి అందకపోవడం ఆయన మరణించారని వైద్యులు తుది నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సుశాంత్‌కు సంబంధించిన మరణంపై లోతైన దర్యాప్తుకు కొన్ని కీలక అవయవాలను (విసేరా) ల్యాబ్‌కు పంపిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన వివరాలు ఇంకా సమర్పించాల్సి ఉంది.

    మరణానికి ముందు ఎలాంటి హింసాత్మక సంఘటనలు

    మరణానికి ముందు ఎలాంటి హింసాత్మక సంఘటనలు

    సుశాంత్ మరణానికి ముందు తలెత్తిన అనుమానాలకు తాజాగా కూపర్ హాస్పిటల్ వైద్యులు అందజేసిన రిపోర్టుతో కొంత సమాధానాలు దొరికే అవకాశం ఉంది. మరణానికి ముందు ఎలాంటి క్రిమినల్ దాడులు గానీ, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదు. ఆయన మెడపైన ఎలాంటి గాయాలు కనిపించలేదని రిపోర్టులో వెల్లడించారు.

    చార్టెట్ అకౌంటెంట్‌ విచారణ

    చార్టెట్ అకౌంటెంట్‌ విచారణ

    సుశాంత్ సింగ్ మరణం తర్వాత పెరుగుతున్న నిరసనలు, అనుమానాల నేపథ్యంలో ముంబై పోలీసులు విచారణను పకడ్బందీగా చేస్తున్నారు. జూన్ 24వ తేదీ బుధవారం సుశాంత్‌కు సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అలాగే డిప్రెషన్‌కు గురైన సుశాంత్‌కు చికిత్స చేసిన డాక్టర్‌ను కూడా బాంద్రా పోలీసులు ప్రశ్నించనున్నారు.

    మేనేజర్‌తో చివరి ఫోన్ కాల్

    మేనేజర్‌తో చివరి ఫోన్ కాల్

    ఇప్పటి వరకు యష్ రాజ్ ఫిల్మ్స్‌ ప్రతినిధులతోపాటు మొత్తం 23 మందిని బాంద్రా పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా 2012లోనే సుశాంత్‌తో కాంట్రాక్టు ముగిసిందని చెప్పినట్టు సమాచారం. ఇక సుశాంత్ మరణానికి ముందు మేనేజర్ ఉదయ్ సింగ్ గౌరితో చివరిగా ఫోన్ కాల్ మాట్లాడినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆయనను కూడా విచారించే అవకాశం ఉంది.

    మీడియా కథనాల ఆధారంగా

    మీడియా కథనాల ఆధారంగా


    సుశాంత్ మరణం తర్వాత వచ్చిన మీడియా కథనాలపై కూడా బాంద్రా పోలీసులు దృష్టిపెట్టారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా, అలాగే మహేష్ భట్‌తో లింక్ ఉన్న కథనాలపై కూడా ముంబై పోలీసులు ఫోకస్ పెట్టారు. వాటిని కూడా దర్యాప్తునకు సమాచారంగా భావించి.. మరికొందరిని విచారించనున్నట్టు తెలిసింది.

    English summary
    Sushant Singh Rajput Final postmortem report handover to Mumbai police on wednesday. Final postmortem reports states no foul play before death. That has concluded that Sushant died by asphyxia due to hanging.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X