twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శబ్దం వస్తే పగలకొట్టొద్దు.. ఆ గది గుట్టు విప్పిన కీ మేకర్.. సుశాంత్ మరణంలో ఊహకందని మిస్టరీ

    |

    బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో అనేక అనుమానాలు పెనుభూతాలుగా మారిపోతున్నాయి. జూన్ 14వ తేదీకి ముందు.. ఆ రోజున సుశాంత్ ఇంట్లో జరిగిన విషయాలు పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా జాతీయ టెలివిజన్ చానెల్‌తో తాళాలు మరమత్తు చేసే వ్యక్తి చెప్పిన విషయాలు షాకింగ్‌గా మారాయి. సుశాంత్ ఉన్న గదికి వేసిన తాళం పగలగొట్టడానికి ముందు జరిగిన విషయాలు పూసగుచ్చినట్టు చెబుతూ..

    Recommended Video

    Sushant Singh Rajput : సుశాంత్ మృతిలో ఊహకందని మిస్టరీ.. గది గుట్టు విప్పిన కీ మేకర్! || Oneindia
     సిద్దార్థ్ పితాని నాకు ఫోన్ కాల్

    సిద్దార్థ్ పితాని నాకు ఫోన్ కాల్

    జూన్ 14వ తేదీ మధ్యాహ్నం 1.05 గంటల ప్రాంతంలో సిద్ధార్థ్ పితాని నుంచి నాకు కాల్ వచ్చింది. గదికి వేసిన తాళం పగలకొట్టాలని నన్ను పిలిచాడు. అయితే తాళం ఫోటోను వాట్సాప్ చేయమని చెప్పాను. దాంతో ఆ ఫోటోను నాకు వాట్సప్‌లో పంపారు. ఆ తర్వాత నేను సుశాంత్ ఇంటిలోని ఆరో అంతస్తుకు వెళ్లాను అని చెప్పారు.

    తాళం పగలగొట్టమని చెప్పి

    తాళం పగలగొట్టమని చెప్పి

    సుశాంత్ ఉన్నట్టు భావిస్తున్న ఆరో అంతస్థు తాళం ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. అక్కడ ఉన్న వారు ఆందోళనకు లోనై తాళం పగలకొట్టమని చెప్పారు. ఒకవేళ ఆ గది నుంచి ఏదైనా శబ్దం వస్తే తాళం తీసే, పగలగొట్టే పని ఆపేయాలని సూచించారు. వారు కంగారు పడటం చూసి నాకు ఏం జరిగిందో అర్ధం కాలేదు అని తాళాలు మరమత్తు చేసే వ్యక్తి జీ టీవీకి తెలిపారు.

     సుత్తితో పగలగొట్టా.. 2 వేలు ఇచ్చి..

    సుత్తితో పగలగొట్టా.. 2 వేలు ఇచ్చి..

    నేను వెళ్లిన ఇళ్లు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది అనే విషయం తెలియదు. ఆ గదికి వేసిన తాళం కంప్యూటరైజ్డ్‌ది. దానిని నేను సుత్తితో పగలకొట్టాను. అందుకు వారు నాకు 2 వేల రూపాయలు ఇచ్చారు. తాళం పగలకొట్టే పని పూర్తి కాగానే నన్ను అక్కడి నుంచి బయటకు పంపించేశారు. సుశాంత్ ఉన్న గదిలోకి నన్ను వెళ్లనివ్వలేదు. నన్ను ఆ గదికి దూరంగా తీసుకెళ్లారు అని తెలిపారు.

     సీబీఐకి నేను సహకరిస్తాను

    సీబీఐకి నేను సహకరిస్తాను

    సుశాంత్ గది వద్ద నుంచి బయటకు వస్తుంటే ఆయన సోదరి ఇంట్లోకి వచ్చింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు గురించి తెలిసింది. అయితే అధికారుల నుంచి నాకు ఎలాంటి కాల్ రాలేదు. ఒకవేళ సీబీఐ అధికారులు కాల్ చేస్తే వారికి నేను సహకరిస్తాను. ముంబై పోలీసులు పిలిస్తే నాకు తెలిసి చెప్పాను. వారు నా స్టేట్‌మెంట్ రికార్డు చేశారు అని తాళాలు మరమ్మత్తు చేసే వ్యక్తి వెల్లడించారు.

    ఊపందుకొన్న సీబీఐ దర్యాప్తు

    ఊపందుకొన్న సీబీఐ దర్యాప్తు

    ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును విచారిస్తున్న సీబీఐ బృందం ముంబైలోని బాంద్రా పోలీసులతో సమావేశమైంది. ముంబై పోలీసు కమిషనర్‌ను కలిసి కేసు డైరీ, సుశాంత్‌కి సంబంధించిన మూడు ఫోన్లు, ఇతర వస్తువులను, కొన్ని ఫైళ్లను స్వాధీనపరుచుకొన్నారు. శుక్రవారం నాడు మనోజ్ శశిధర్‌తో కూడిన సీబీఐ అధికారులు బృందం దర్యాప్తుతో ముంబై పోలీసు, మీడియా వర్గాల్లో హడావిడి ఎక్కువగా కనిపించింది.

    English summary
    Sushant Singh Rajput suicide: Key maker revealed few interesting facts on death day. Siddharth Pithani called me to open the door of the room. I tried opening the door with my tools after which they asked me to break the lock. he was told to stop the work immediately if there was a sound from inside the room.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X