కరణ్, సోనమ్, ఆలియాపై గట్టిగానే దెబ్బ.. సుశాంత్ మరణాంతరం షాక్ ఏ రేంజ్‌లో అంటే!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత సినీ ప్రముఖులపై నిరసనల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రధానంగా సినీ పరిశ్రమలో నటుల పిల్లలకు ప్రోత్సాహం, వారసత్వాన్ని ఎంకరేజ్ చేయడం లాంటి అంశాలపై మరోసారి చర్చ భారీగానే జరుగుతున్నది. కరణ్జ్ జోహర్, ఆలియాభట్, సోనమ్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ లాంటి ప్రముఖులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసింది. బాలీవుడ్ సినీ ప్రముఖులపై ఏ రేంజ్‌లో అసంతృప్తి నెలకొన్నదంటే..

Recommended Video

Sushant Singh Rajput : Sushant మరణాంతరం.. Karan Johar, Alia Bhatt కు షాక్ ఇచ్చిన నెటిజన్స్!
కరణ్ జోహర్‌పై భారీగా అసహనం

కరణ్ జోహర్‌పై భారీగా అసహనం


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి పరోక్షంగా కారణమంటూ కరణ్ జోహర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సినీ ప్రముఖుల పిల్లలకే కరణ్ ప్రోత్సాహం అందిస్తారు. వారినే తన సినిమాల్లోకి తీసుకొంటారు అంటూ మండిపడుతున్నారు. ఆయనను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. గత వారం రోజల్లో దాదాపు 330k మంది ఫాలోవర్స్ కరణ్‌ జోహర్‌ను అన్‌ఫాలో అయ్యారు. దీంతో ఆయనపై అసహనం భారీగానే ఉన్నట్టు స్పష్టమైంది.

సోనమ్‌పై నెటిజన్ల కన్నెర్ర

సోనమ్‌పై నెటిజన్ల కన్నెర్ర

సుశాంత్‌ సింగ్‌ బతికి ఉన్న రోజుల్లో చాలా రకాలుగా అవమానాలు, వేధింపులకు గురిచేసిన సోనమ్ కపూర్‌పై నెటిజన్లు కన్నెర్ర చేస్తున్నారు. కరణ్ జోహర్ చాట్ షో కాఫీ విత్ కరణ్‌లో సుశాంత్ సింగ్‌ను తక్కువగా చేసి మాట్లాడటం ఇప్పుడు వైరల్‌గా మారింది. కరణ్ అడిగిన ప్రశ్నకు అసలు సుశాంత్ సింగ్ ఎవరు. నాకు తెలియదు అని సోనమ్ సమాధానం ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో సోనమ్‌ను గత 5 రోజుల్లో 170k మంది అన్‌ఫాలో అవుతున్నారు.

ఆలియాభట్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం

ఆలియాభట్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం


సుశాంత్ సింగ్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆలియా భట్‌కు అందరి కంటే ఎక్కువగానే గట్టి దెబ్బ పడింది. కరణ్ జోహర్ షోలోనే సుశాంత్ ఎవరో నాకు తెలియదు అంటూ సమాధానం ఇవ్వడం, దానిని సమర్ధిస్తూ కరణ్ టెలివిజన్ నటుడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఈ క్రమంలో గత 5 రోజుల్లో 750k మంది ఆమెను అన్‌ఫాలో అవుతున్నారు.

సుశాంత్ మరణం తర్వాత గంభీర పరిస్థితులు

సుశాంత్ మరణం తర్వాత గంభీర పరిస్థితులు

సుశాంత్ సింగ్ మరణం తర్వాత పరిస్థితులు గంభీరంగా మారుతున్నాయి. బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో కరణ్ జోహర్‌పై కేసు నమోదైంది. సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక ముగ్గురు అభిమానులు మరణించడం షాకింగ్‌కు గురిచేసున్నది. తాజాగా పోర్ట్‌బ్లెయిర్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం దిగ్బ్రాంతికి గురిచేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X