twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ కేసులో ఆ మూడు డీల్స్‌పై అనుమానాలు.. ఆ చెల్లింపులపైనే పోలీసుల నజర్

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత దర్యాప్తు వేగంగా చేస్తున్న ముంబై పోలీసులు యష్ రాజ్ ఫిల్మ్స్‌ సంస్థతో ఉన్న ఒప్పందాలపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. సుశాంత్‌తో యష్ రాజ్ ఫిలింస్ మొత్తం మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకోవడం తెలిసిందే. అయితే ఆ ఒప్పందానికి సంబంధించిన కాపీలను స్వాధీనపరచుకొన్న బాంద్రా పోలీసులు వాటి ఆధారంగా యష్ రాజ్ ఫిల్మ్ ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఆ క్రమంలో సుశాంత్‌కు చెల్లించిన పారితోషికం వివారాలు మీడియా దృష్టికి వచ్చాయి. ఆ వివరాలు ఏమిటంటే..

    Recommended Video

    Sushant Singh Rajput కేసు మిస్టరీ, వెలుగు లోకి సంచలన విషయాలు!!
    యష్ రాజ్‌తో మూడు సినిమాలు

    యష్ రాజ్‌తో మూడు సినిమాలు

    బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్‌ ఫిల్మ్స్ సుశాంత్‌తో మూడు సినిమాల్లో నటించే విధంగా ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఆ క్రమంలో హిట్టు.. ఫ్లాప్ అనే తేడా లేకుండా ఆయనతో అగ్రిమెంట్‌ను చేసుకొన్నారు. దాంతో మూడు సినిమాలను పూర్తి చేసుకొన్నారు. అయితే యష్ రాజ్ మూవీస్ సుశాంత్ సింగ్‌తో చేసుకొన్న ఒప్పందంలో భాగంగా చెల్లించిన పారితోషికాలు పోలీసుల దృష్టికి వచ్చాయి.

    తొలి సినిమాకు రూ.30 లక్షలు

    తొలి సినిమాకు రూ.30 లక్షలు

    సుశాంత్‌ సింగ్‌తో యష్ రాజ్ ఫిలింస్ తీసిన మొదటి సినిమా శుద్ద్ దేశీ రొమాన్స్. ఈ చిత్రంలో పరిణితి చోప్రా, వాణికపూర్ హీరోయిన్లు. ఈ సినిమాలో నటించినందుకు యష్ రాజ్ ఫిలింస్ రూ.30 లక్షలు రెమ్యునరేషన్‌గా చెల్లించారు. అప్పట్లో యువ నటుడు అందుకొన్న పారితోషికం మీడియాలో చర్చనీయాంశమైంది.

    రెండో సినిమాకు 1 కోటి రూపాయలు

    రెండో సినిమాకు 1 కోటి రూపాయలు

    ఇక సుశాంత్‌తో యష్ రాజ్ ఫిలింస్ తీసిన రెండో సినిమా డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి. దర్శకుడు దివాకర్ బెనర్సీ రూపొందించిన ఈ చిత్రంలో నటించినందుకు గాను సుశాంత్‌కు ముట్ట జెప్పింది రూ.1 కోటి. తొలి సినిమా శుద్ద్ దేవీ రొమాన్స్ భారీ విజయం సాధించడంతో ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ను చెల్లించినట్టు తెలిసింది.

    మూడో సినిమా క్యాన్సిల్

    మూడో సినిమా క్యాన్సిల్

    ఇక మూడో సినిమా విషయంలోనే కొంత వివాదంగా మారింది. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌తో పానీ అనే సినిమాను రూపొందించాల్సి ఉంది. అయితే ఆ సినిమా కేన్స్ వేదికపై ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏదో కారణంగా సినిమాను పక్కన పెట్టారు. దాంతో తొలిసారి సుశాంత్‌ తన కెరీర్‌లో మనస్తాపానికి గురయ్యారని చెప్పుకొంటారు.

    రెండో సినిమా రెమ్యునరేషన్‌పై సందేహాలు

    రెండో సినిమా రెమ్యునరేషన్‌పై సందేహాలు


    అయితే ఒప్పదం ప్రకారం సుశాంత్ రెండో సినిమాకు రూ.60 లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ రూ.1 కోటి చెల్లించారనే విషయంపై క్లారిటీ మిస్ అయింది. ఆ తర్వాత అదే సంస్థలో చేయాల్సి ఉండగా, ఆదిత్య చోప్రా, శేఖర్ కపూర్ మధ్య తలెత్తిన విభేదాలతో పానీ సినిమా తెరపైకి రాలేకపోయిందనే రూమర్లు బాలీవుడ్‌లో వచ్చాయి.

    English summary
    Mumbai polices are contrating on YRF three film deals with Sushant Singh Rajput. They aquired the copies of agreement and scrutinising the deals. As per reports, Sushant paid 1 crore for the second movie in YRF.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X