twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముగింపు దిశగా సుశాంత్ సూసైడ్.. సాక్ష్యాలపై పోలీసుల సంచలనం.. జోరందుకొన్న సీబీఐ డిమాండ్

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంబై పోలీసుల దర్యాప్తు కీలకంగా మారింది. జూన్ 14వ తేదీ తర్వాత నుంచి బాంద్రా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు రిపోర్టు ముగింపు దశకు చేరుకొన్నట్టు సమాచారం. తాజాగా ముంబై పోలీసులు వెల్లడించిన అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అవేమిటంటూ..

    Recommended Video

    Sushant Singh Rajput కేసు ముగించేస్తున్న ముంబై పోలీసులు Sensational Evidence లేదంటూ, CBI లేనట్టేనా ?
    నెల రోజులుగా ముమ్మర దర్యాప్తు

    నెల రోజులుగా ముమ్మర దర్యాప్తు

    గత నెలరోజులుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును ముంబైకి చెందిన పలువురు పోలీసుల బృందం దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుతో టచ్ ఉన్న ప్రతీ ఒక్కరిని దశల వారీగా విచారించారు. పలు ప్రశ్నలను సంధించి కీలక సమాచారాన్ని నమోదు చేశారు. సంజయ్ లీలా భన్సాలీ, శేఖర్ కపూర్, రియా చక్రవర్తితోపాటు పలు సినీ నిర్మాణ సంస్థల ప్రతినిధులను క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఈ కేసులో దాదాపు 35 మందికిపైగా వ్యక్తులను ప్రశ్నించడం జరిగింది.

    ఐదుగురితో కూడిన పోలీసుల బృందం

    ఐదుగురితో కూడిన పోలీసుల బృందం

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణ ముగింపు దశకు రావడంతో ఐదుగురితో కూడిన పోలీసు అధికారులు మరోస్థాయి దర్యాప్తుకు సిద్ధమయ్యారు. శనివారం నాడు ఫొరెన్సిక్ నిపుణుల బృందంతో సమావేశమై ఈ కేసు గురించి చర్చించారు. అయితే ఫోరెన్సిక్ నిపుణులతో జరిగిన చర్చల వివరాలను గోప్యంగా ఉంచారు.

    15 రోజుల్లోగా తుది నివేదిక

    15 రోజుల్లోగా తుది నివేదిక

    గత నెలరోజులుగా సాగిన దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని నివేదికగా రూపొందించే పనిలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. తుది నివేదికను 10 నుంచి 15 రోజుల్లో ఉన్నతాధికారులకు అప్పగిస్తాం. అవసరమైతే మరికొందరిని విచారించడానికి కూడా వెనుకాడం. ప్రస్తుతం గత నెల రోజుల్లో తాము రూపొందించిన, సేకరించిన విషయాలను క్రోడికరించే పనిలో ఉన్నాం అని ముంబై పోలీసులు వెల్లడించినట్టు తెలిసింది.

    సంచలన సాక్ష్యాలు, విషయాలేవీ బయటకు రాలేదు

    సంచలన సాక్ష్యాలు, విషయాలేవీ బయటకు రాలేదు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది సూసైడేనా లేదా సహజ మరణం కాదా? అనే అంశాలపై ఫొరెన్సిక్ నిపుణులు, ఇతర దర్యాప్తు బృందాలతో చర్చించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే చర్చల అంశాలను వెల్లడించమని, కాకపోతే ఈ కేసులో వారి నుంచి సంచలన విషయాలు, సాక్ష్యాలు ఏవీ బయటకు రాలేదు అనే విషయాన్ని వెల్లడించడంతో ఈ కేసు విచారణ ముగిసిందనే సంకేతాలను పోలీసులు బయటి ప్రపంచానికి చేరవేసే ప్రయత్నం చేశారు.

    జోరందుకొన్న సీబీఐ డిమాండ్

    జోరందుకొన్న సీబీఐ డిమాండ్

    సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకొన్న సమయంలో సోషల్ మీడియాలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌కు మద్దతు పెద్ద ఎత్తున లభిస్తున్నది. అధికార బీజేపీ ఎంపీలు, సినీ ప్రముఖులు పలువురు ఈ కేసు దర్యాప్తుకు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ నటి, ఎంపీ రూపా గంగూలి, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడం తెలిసిందే.

    English summary
    Sushant Singh Rajput suicide: Mumbai Police reports no sensational evidence: BJP leader Subramanian Swamy demands CBI investigation on Aamir, Salman, Shah Rukh Khan over Sushant Singh Rajput suicide case. He tweeted that The assets created by these three Khan in India and abroad especially in Dubai need to be investigated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X