రియా మెడకు సుశాంత్ కేసు ఉచ్చు.. సోదరుడిని వదలని పోలీసులు.. వెలుగులోకి కొత్త బిజినెస్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు అంతా అతడి మాజీ ప్రేయసి రియా చక్రవర్తి చుట్టే తిరుగుతున్నది. తాజాగా కొద్ది రోజుల క్రితం ఆమె పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియా చక్రవర్తి సోదరుడిని కూడా ప్రశ్నించాలని ముంబై పోలీసులు నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే వారి మధ్య జరిగిన బిజినెస్ గురించి, దానిలో ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించడానికి బాంద్రా పోలీసులు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Sushant Singh Rajput : Sushant సూసైడ్ పై Rhea Chakraborty తమ్ముడిని ప్రశ్నించనున్న ముంబై పోలీసులు!
27 మందిని విచారించాం..

27 మందిని విచారించాం..

సుశాంత్ సింగ్ సూసైడ్ కారణాలపై చేస్తున్న దర్యాప్తుపై ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తాజాగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు బాంద్రా పోలీసులు 27 మందిని విచారించి వారి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. మాకు పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కూడా వచ్చింది. ఉరివేసుకొన్న సమయంలోనే ఊపిరి ఆడక ఆయన మరణించాడు అని వెల్లడించారు.

ప్రతీ కోణంలో విచారణ చేస్తున్నాం

ప్రతీ కోణంలో విచారణ చేస్తున్నాం

అయితే సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్న సుశాంత్ సింగ్‌కు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకు గల కారణాలను బయటకు లాగేందుకు దర్యాప్తు చేస్తున్నాం. మాకు లభించిన ఆధారాలను బేస్ చేసుకొని ప్రతీ కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాం. అనుమానం వచ్చిన ప్రతీ ఒక్కరిని విచారిస్తున్నాం అని ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు.

రిలేషన్‌షిప్ లేదని రియా

రిలేషన్‌షిప్ లేదని రియా

సుశాంత్‌ మరణానికి ముందు సన్నిహితంగా వ్యవహరించిన రియాను పది గంటలపాటు పలు కోణాల్లో ప్రశ్నించాం. ఆ విచారణలో సుశాంత్‌తో రిలేషన్‌షిప్ లేదనే విషయాన్ని వెల్లడించారు. అయితే మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా కొన్ని విషయాలు విచారణలో చెప్పారు. వాటిని కూడా మేము పరిశీలనలోకి తీసుకొన్నాం. అలాగే తన తమ్ముడితో సుశాంత్ ప్రారంభించిన బిజినెస్ వివరాలను కూడా వెల్లడించారన్నారు.

సుశాంత్‌తో రియా ఫ్యామిలీ బిజినెస్

సుశాంత్‌తో రియా ఫ్యామిలీ బిజినెస్

రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తితో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. వారి్దదరు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు. వివిడ్‌రేజ్ రియాలిటిక్స్ అనే పేరుతో సంస్థ వ్యాపార కార్యకలాపాలను 2019లో రియా చక్రవర్తి మొదలుపెట్టారు అని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పత్రిక ఓ కథనాన్ని వెల్లడించింది.

వ్యాపార లావాదేవీలపై నజర్

వ్యాపార లావాదేవీలపై నజర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఓ వ్యాపారం బయటకు రావడంతో ముంబై పోలీసులు ఆ విషయంపై దృష్టిపెట్టారు. ఆ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల గురించి ప్రశ్నించేందుకు షోవిక్ చక్రవర్తిని విచారణకు పిలిచేందుకు సిద్ధమయ్యారు. బిజినెస్ వ్యవహారాల్లో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకొనేందుకు రియా సోదరుడిని పిలువాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X