twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సూసైడ్‌ కేసులో మరిన్ని అనుమానాలు.. ట్విట్టర్‌కు లేఖ రాసిన ముంబై పోలీసులు

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ముంబై పోలీసుల దర్యాప్తు చాలా వేగంగా, ఇంటెన్సివ్‌గా సాగుతున్నది. ఈ కేసులో ఎలాంటి ఆధారం వదలకుండా విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ 24వ తేదీ బుధవారం ఫైనల్ పోస్ట్‌మార్టం రిపోర్టు అందుకొన్న పోలీసులు సుశాంత్ సుసైడ్ కేసులో మరో కీలకమైన నిర్ణయం తీసుకొన్నారు. ఆ నిర్ణయం ఏమిటంటే..

    Recommended Video

    Sushant Singh Rajput : Sushant Twitter లో మాయమైన ట్వీట్లు.. సూసైడ్‌ కేసులో పోలీసుల షాకింగ్ నిర్ణయం!
    ట్విట్టర్‌లో ఎలాంటి పోస్టులు

    ట్విట్టర్‌లో ఎలాంటి పోస్టులు

    సుశాంత్ సోషల్ మీడియాలో గత కొద్దికాలంగా ఏం జరిగింది? ఎలాంటి పోస్టులు పెట్టారనే అనే కోణంలో దర్యాప్తు చేపట్టేందుకు నిర్ణయం తీసుకొన్నారు. అయితే సుశాంత్ ట్విట్టర్ ఖాతాలో కొన్ని ట్వీట్లు కనిపించకుండా పోవడంతో మళ్లీ పోలీసులకు అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో బాంద్రా పోలీసులు ట్విట్టర్‌ సంస్థకు లేఖ రాయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

    కొన్ని ట్వీట్లు, స్క్రీన్ షాట్లు డిలీట్

    కొన్ని ట్వీట్లు, స్క్రీన్ షాట్లు డిలీట్

    సుశాంత్ వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్‌లోని ట్వీట్లపై దృష్టిపెట్టాం. కానీ కొన్ని రోజుల క్రితం పోస్టు చేసిన ట్వీట్లు కనిపించకపోయాయి. తన ఖాతా నుంచి కొన్ని ట్వీట్లను డిలీట్ అయ్యాయి. అయితే ఎందుకు వాటిని డిలీట్ చేశారు. ఆ ట్వీట్స్ ఏమై ఉంటాయనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. సుశాంత్ ట్విట్టర్‌లో 2019లో డిసెంబర్ 27వ తేదీన చేసిన పోస్టు మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే అనేక అనుమానాలు వస్తున్నాయి అని బాంద్రా పోలీసులు పేర్కొన్నారు.

    ట్విట్టర్‌కు లేఖ రాశాం

    ట్విట్టర్‌కు లేఖ రాశాం

    సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన ట్వీట్లపై అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే కొన్ని స్క్రిన్ షాట్లు కూడా డిలీట్ చేశారు. కాబట్టి డిలీటైన ట్వీట్లు, స్క్రీన్ షాట్లను పరిశీలించాలని, విచారణకు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాం. అందుకే వాటి వివరాలు కావాలని ట్విట్టర్‌కు లేఖ రాశాం అని పోలీసు వర్గాలు మీడియాకు వెల్లడించారు.

    మీడియా కథనాలపై పరిశీలిస్తున్నాం

    మీడియా కథనాలపై పరిశీలిస్తున్నాం

    ఇప్పటికే సుశాంత్ మరణం వెనుక అనేక ఊహగానాలు, రూమర్లు, ఆరోపణలు మీడియాలో కనిపించాయి. మీడియాలో కథనాలు రాసిన వారిని కూడా ప్రశ్నించాలని నిర్ణయం తీసుకొన్నాం. మీడియా కథనాలకు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను అడిగి తెలుసుకోవాలనుకొంటున్నాం. మీడియాలో కథనాలు రాసిన వారిని కూడా ప్రశ్నిస్తే కొంత సమాచారం కూడా లభించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

    ట్విట్టర్‌ సమాధానం కోసం వెయిటింగ్

    ట్విట్టర్‌ సమాధానం కోసం వెయిటింగ్

    ఇప్పటి వరకు సుశాంత్ తండ్రి, ఇద్దరు చెల్లెల్లు, యాక్టర్ రియా చక్రవర్తితోపాటు మొత్తం 23 మందిని విచారించాం. పలు అంశాల ఆధారంగా ప్రశ్నించి సమాధానాలు రాబట్టాం. చార్టెట్ అకౌంట్‌ నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. ఈ కేసులో ఇంకా కొద్ది మందిని కూడా విచారిస్తాం. ఇక ట్విట్టర్ నుంచి వచ్చే సమాధానం కోసం వేచి చూస్తున్నాం. డిలీటైన ట్వీట్ల ద్వారా మరింత సమాచారం ఏదైనా లభించ వచ్చనే ఆశాభావంతో ఉన్నాం అని బాంద్రా పోలీసులు వెల్లడించారు.

    English summary
    Mumbai police has taken another Shocking decision in Actor Sushant Singh Rajput Suicide, The Mumbai police writes letter to Twitter for deleted tweets and some screen shots.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X