సుశాంత్ సూసైడ్.. ఆ కాంట్రాక్టే కారణామా? పోలీసుల ముందుకు సంజయ్ భన్సాలీ!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ ఎడతెగని సీరియల్‌గా సాగుతున్నది. సుశాంత్ మరణం తర్వాత పలు వర్గాల నుంచి అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించారు. పలు కోణాల్లో అనేక మందిని విచారిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి సమన్లు జారీ చేయడం సంచలనం రేపింది. సుశాంత్ కేసులో అసలేం జరుగుతున్నదంటే..

మరణానికి కారణం అదేనా?

మరణానికి కారణం అదేనా?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీ అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకోవడం సినీ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. సక్సెస్‌ జోష్‌తో ముందుకెళ్తున్న ఈ యువ హీరో అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం పలువురిలో అనేక సందేహాలను రేకెత్తించింది. దాంతో సుశాంత్ మరణానికి అసలు కారణం ఏమిటనే కోణంలో దిశగా బాంద్రా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

29 మందిని విచారించిన ముంబై పోలీసులు

29 మందిని విచారించిన ముంబై పోలీసులు

గత 15 రోజులకుపైగా దర్యాప్తులో ముంబై పోలీసులు దాదాపు 29 మందిని విచారించారు. పలు విషయాలపై ఆరా తీస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. పోస్టు మార్టం, ఫొరెన్సిక్ నివేదిక అధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితురాలు, హీరోయిన్ రియా చక్రవర్తి, క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా, యష్ రాజ్ ఫిలింస్ క్యాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మ, దిల్ బేచారా హీరోయిన సంజనా సంఘీని విచారించారు.

సుశాంత్‌ను భన్సాలీ ఎందుకు తప్పించారు?

సుశాంత్‌ను భన్సాలీ ఎందుకు తప్పించారు?

ఇక కెరీర్ ఆరంభంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంజయ్ లీలా భన్సాలీ ఓ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. అయితే డేట్స్ కుదరకపోవడం వల్ల సుశాంత్‌ను తప్పించి మరో హీరోతో సినిమాను తీశారు. ఆ క్రమంలో సంజయ్ భన్సాలీని ఎవరైనా ప్రభావితం చేశారా? లేక నిజంగానే డేట్ల సర్దుబాటు కాలేదా? వారి మధ్య ఆ కాంట్రాక్టు ఎందుకు క్యాన్సిల్ అయింది అనే కోణంపై పోలీసులు దృష్టిపెట్టారు.

ఆర్నెళ్లుగా మానసిక రుగ్మతతో

ఆర్నెళ్లుగా మానసిక రుగ్మతతో

పలు సినిమా ఆఫర్లు ముందుకు వచ్చి ముఖం చాటేయడంతో సుశాంత్ సింగ్ డిప్రెషన్‌కు లోనయ్యారు. గత ఆర్నెళ్లుగా మానసిక రుగ్మతతో బాధపడతున్నారు. ఆ పరిస్థితులే సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించాయా? అనే దిశగా దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో సంజయ్ లీలా భన్సాలీని జూలై 6న విచారణకు హాజరుకావాలంటూ బాంద్రా పోలీసులు సమన్లు జారీ చేశారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
ప్రొఫెషనల్‌గా శతృత్వం ఏమైనా ఉందా?

ప్రొఫెషనల్‌గా శతృత్వం ఏమైనా ఉందా?

సుశాంత్‌ సినిమాలు భారీ విజయాలు సాధించినప్పటికీ ఆఫర్లు చేజారడం వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయి? ప్రొఫెషనల్‌గా ఎవరితోనైనా శతృత్వం ఏదైనా ఉందా? సుశాంత్ నిజంగా డిప్రెషన్‌కు లోనయ్యారా? అసలు డిప్రెషన్‌కు సుశాంత్ లోనైతే కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో పలువురి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X