twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సూసైడ్.. శేఖర్ కపూర్ యూటర్న్.. విచారణలో నోరువిప్పని డైరెక్టర్

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో దర్శకుడు శేఖర్ కపూర్‌ను వాగ్మూలాన్ని ముంబై పోలీసులు సేకరించారు. దర్శకుడు శేఖర్ కపూర్ ప్రస్తుతం ముంబైకి దూరంగా ఉండటం వల్ల ఆయన బాంద్రా పోలీసుల విచారణకు హాజరుకాలేదనే విషయం స్పష్టమైంది. అయితే తన స్టేట్‌మెంట్‌ను ఈమెయిల్ ద్వారా పోలీసులకు చేరవేసినట్టు తెలిసింది. అయితే సుశాంత్ మరణం తర్వాత భావోద్వేగంగా స్పందించిన ఆయన విచారణ విషయానికి వచ్చే వరకు ఆయన యూటర్న్ తీసుకొన్నట్టు కనిపిస్తున్నది. తాజాగా ఆయన పంపిన ఈమెయిల్‌లో ఏం చెప్పారంటే..

    Recommended Video

    Sushant Singh Rajput : Sushant సూసైడ్.. శేఖర్ కపూర్ యూటర్న్..!! || Oneindia Telugu
    పానీ మూవీ క్యాన్సిల్ కావడం వెనుక

    పానీ మూవీ క్యాన్సిల్ కావడం వెనుక

    సుశాంత్‌తో తాను తీయాలనుకొన్న పానీ మూవీని కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకొన్నారు. ఆ సినిమా క్యాన్సిల్ కావడానికి ఓ గ్రూప్ కీలకంగా వ్యవహరించేదనే విధంగా ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత నా భుజంపై తలపెట్టి భోరున ఏడ్పారంటూ ట్వీట్‌లో తెలిపారు.

    డిప్రెషన్ కారణమేమిటి?

    డిప్రెషన్ కారణమేమిటి?

    సుశాంత్ మరణం తర్వాత ఆయన సినిమాలు చేజారడమే డిప్రెషన్‌కు కారణమా? లేక ఇంకా ఏదైనా రీజన్ ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. శేఖర్ కపూర్ చేసిన ట్వీట్‌పై చర్చ జరగడం, దానిని ఆధారంగా చేసుకొని పలువురు కామెంట్లు చేయడంతో ఆయనను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. అయితే సిటీకి దూరంగా ఉన్నానంటూ ఈమెయిల్ ద్వారా తన స్టేట్‌మెంట్‌ను పంపగా.. అందుకు జవాబుగా ముంబైకి వచ్చిన తర్వాత స్వయంగా విచారణకు హాజరుకావాలని పోలీసులు సూచించినట్టు సమాచారం.

    ఎవరి పేర్లు కూడా చెప్పని శేఖర్ కపూర్

    ఎవరి పేర్లు కూడా చెప్పని శేఖర్ కపూర్

    అయితే శేఖర్ కపూర్ పంపిన స్టేట్‌మెంట్‌లో బాలీవుడ్‌లో సుశాంత్ కెరీర్‌ను నాశనం చేసిన వారి పేర్లను వెల్లడించలేదని, అలాగే ఏ ఒక్కరి పేరును కూడా ఉదహరించలేదనే విషయాన్ని పోలీసు వర్గాలు మీడియాకు వెల్లడించినట్టు సమాచారం. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ మరణం తర్వాత శేఖర్ కపూర్ వాగ్మూలం కీలకంగా మారుతుందనే ఆశించిన వారికి తాజా పరిణామం షాకిచ్చినంత పనైంది.

     30కి పైగా మందిని ప్రశ్నించని ముంబై పోలీసులు

    30కి పైగా మందిని ప్రశ్నించని ముంబై పోలీసులు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్‌ను కుదిపేసింది. సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్‌కు చెందిన కొన్ని ఫ్యామిలీలే అంటూ కంగన రనౌత్, శేఖర్ సుమన్ తదితర ప్రముఖులు ఆరోపణలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియాలో కరణ్ జోహర్, ఆలియాభట్, సోనమ్ కపూర్ లాంటి వారిని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ముంబై పోలీసులు 30కి పైగా మందిని ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టారు.

    English summary
    Bollywood hero Sushant Singh Rajput case: Shekhar Kapoor questioned by Mumbai Police on Wednesday. Shekhar Kapoor was sent email for mumbai police questions. After sushant death, Shekhar Kapoor tweeted that, I knew the pain you were going through. I knew the story of the people that let you down so bad that you would weep on my shoulder. I wish Iwas around the last 6 months. I wish you had reached out to me. What happened to you was their Karma. Not yours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X