దిశ సలియాన్ మృతి షాక్.. సుశాంత్ ప్రెస్ మీట్‌ పెట్టి నిజాలు చెప్పాలని ప్లాన్.. అంతలోనే మృత్యువు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై కలుగుతున్న ఎన్నో మరణాలపై అనుమానాలు మరింత బలపడతున్నాయి. దిశ మరణానికి సుశాంత్ సింగ్ మృతి లింక్ ఉందనే ఆరోపణల నేపథ్యంతో పలు సంచలన విషయాలను సామాజిక కార్యకర్త ప్రశాంత్ వెల్లడించారు. ప్రశాంత్ చెప్పిన విషయాలు ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు ప్రశాంత్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput : Disha Salian మృతి పై ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలు బయటపెట్టాలనుకున్న Sushant!
పార్టీలో దిశా సలియాన్‌తో గొడవ

పార్టీలో దిశా సలియాన్‌తో గొడవ

దిశ సలియాన్ తన మరణానికి ముందు ఆమె బాలీవుడ్ ప్రముఖులు, మహారాష్ట్ర రాజకీయ నేతలు పాల్గొన్న పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీలో ఆమెకు గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సుశాంత్‌కు గొడవ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత గంటలోపే దిశ సలియాన్ సూసైడ్ చేసుకొందనే వార్త బయటకు వచ్చింది.

దిశ మరణంతో కుంగిపోయిన సుశాంత్

దిశ మరణంతో కుంగిపోయిన సుశాంత్

దిశ సలియాన్ మరణ వార్త వినగానే సుశాంత్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. గది దద్దరిల్లేలా రోదించారు. ఓ దశలో సృహతప్పి పడిపోయారు. అలా దిశ మరణం సుశాంత్‌ను మానసికంగా కుంగదీసింది. దిశ మరణం వెనుక పలు విషయాలను మీడియాకు చెప్పేందుకు ప్రెస్ మీట్ పెట్టాలని భావించారు అని ప్రశాంత్ తనకు తెలిసి సమాచారాన్ని వెల్లడించారు.

దిశ మరణం తర్వాత ప్రాణభయంతో

దిశ మరణం తర్వాత ప్రాణభయంతో

దిశ మరణం తర్వాత సుశాంత్‌ ప్రాణభయంతో వణికి పోయారు. తన సోదరికి ఫోన్ చేసి నన్ను కూడా వదిలిపెట్టరు.. నాకు ప్రాణభయం ఉందనే విషయాన్ని పంచుకొన్నారు. ఆ విషయాన్ని తనకు కూడా చెప్పారు అని సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మిత పారిఖ్ చెప్పారు. సుశాంత్ మరణం సూసైడ్ కాదు. ఆయనది హత్యే అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ సీబీఐ దర్యాప్తు జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

దిశ మరణం తర్వాత సుశాంత్‌ను వదిలేసి రియా

దిశ మరణం తర్వాత సుశాంత్‌ను వదిలేసి రియా

దిశ మరణం తర్వాత రియా చక్రవర్తికి సుశాంత్‌కు తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. జూలై 8 నుంచి జూలై 14వ వరకు రియా, సుశాంత్ గొడవ పడ్డారు. ఆ తర్వాత తన మరణానికి కొద్ది రోజుల ముందు సుశాంత్‌ను వదిలేసి రియా ఇంటి నుంచి వెళ్లిపోయింది. సుశాంత్ ఒంటరిగానే ఇంటిలో ఉన్నారు. ఏదైనా జరిగితే వెంటనే నాకు ఫోన్ చేయి అని రియా తనతో చెప్పినట్టు సిద్ధార్థ్ పితాని మీడియాకు వెల్లడించడం గమనార్హం.

సుశాంత్ చెప్పాలనుకొన్న విషయాలు ప్రశ్నలుగానే

సుశాంత్ చెప్పాలనుకొన్న విషయాలు ప్రశ్నలుగానే

అయితే దిశ మరణానికి ముందు ఏం జరిగింది? దిశ గురించి ఏం చెప్పాలనుకొన్నాడు? సుశాంత్‌ను ఎవరు బెదిరించారు? దిశ మరణం తర్వాత రియాకు, సుశాంత్ గొడవ ఎందుకు జరిగింది? రియా సుశాంత్‌ను వదిలి ఎందుకు వెళ్లిపోయిందనే ప్రశ్నలు ఇప్పుడు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వాటికి సమాధానం దొరకాలంటే సిబీఐ దర్యాప్తు తప్పనిసరి అనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X