For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ టార్చర్ భరించలేకపోతున్నా.. అందుకే ఆత్మహత్య.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్రెండ్ సూసైడ్ నోట్‌!

  |

  దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ విషాదాన్ని ఇంకా మరిచిపోకముందే ఆయన స్నేహితుడు, ఎంఎస్ ధోని ఫేమ్ సందీప్ నహార్ ఆత్మహత్య చేసుకోవడం హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఢిల్లీకి సమీపంలోని గోరేగామ్ ప్రాంతంలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్నట్టు తెలిసింది. తన మరణానికి ముందు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. భార్యతో ఉన్న గొడవలు, విభేదాల కారణంగానే నహార్ సూసైడ్ చేసుకొన్నట్టు స్పష్టమైంది. సందీప్ నహార్ రాసిన సుసైడ్ నోట్‌లో ఏమున్నదంటే..

  మానసిక సమస్యలు, వేధింపులతో

  మానసిక సమస్యలు, వేధింపులతో

  సందీప్ నహార్ మరణానికి ముందు తన బాధలను, కష్టాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. వీడియో రూపంలో విడుదల చేసిన సూసైడ్ నోట్‌లో తాను వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా సమస్యలను ఎదుర్కొంటున్నాను. మానసికంగా నేను జీవించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే నేను ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకొంటున్నాను అని సందీప్ నహార్ పేర్కొన్నారు.

   ఇక జీవించాలనే కోరిక లేదు

  ఇక జీవించాలనే కోరిక లేదు

  సందీప్ నహార్ తన వీడియో పోస్టులో మాట్లాడుతూ.. ఈ భూమి మీద జీవించాలనే కోరిక లేదు. జీవితంలో ఎన్నో సుఖ:దుఖాలు చూశాను. నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు అనుభవిస్తున్న మానసిక వేదనను నేను భరించలేకపోతున్నాను. దానిని నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. సూసైడ్ చేసుకోవడం పిరికితనమని తెలుసు. నాకు జీవించాలనే ఆశ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం అవసరమా అనే ఫీలింగ్ కలిగించింది అని సందీప్ నహార్ తన పోస్టులో పేర్కొన్నారు.

  నా భార్య, అత్త నన్ను వేధించారు

  నా భార్య, అత్త నన్ను వేధించారు

  సందీప్ నహార్ తన వీడియోలో ఆవేదనను వ్యక్తం చేస్తూ.. నాకంటూ ఓ ఆత్మగౌరవం లేదు. నా భార్య కంచన్ శర్మ, ఆమె తల్లి విను శర్మ నన్ను సరిగా అర్ధం చేసుకోలేదు. అర్థం చేసుకొనేందుకు కూడా ప్రయత్నించలేదు. నా భార్య హైపర్ నేచర్ స్వభావంతో నన్ను వేధించారు. ఆమె వ్యక్తిత్వం వేరు, నా పర్సనాలిటీ వేరు. మా ఇద్దరికి సరిపడటం లేదు. ప్రతీ రోజు గొడవలే. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా గొడవలతోనే జీవితం గడిచిపోతున్నది. వాటిని భరించే శక్తి నాకు లేదు అని బాధను వెల్లగక్కారు.

  నా భార్య ప్రవర్తనను భరించలేకపోయా

  నా భార్య ప్రవర్తనను భరించలేకపోయా

  నా కష్టాలు, సమస్యలకు కారణం నా భార్య కంచన్ కాదు. ఆమె వ్యక్తిత్వం, ప్రవర్తన అంతే. తాను చేసేది ఆమెకు అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ నాకు ఆమె ప్రవర్తన భరించలేనంతగా ఉంటుంది. ముంబైలో నేను చాలా కాలంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాను. కానీ ఇంతగా నా మనసు విరిగిపోలేదు అని సందీప్ నహర్ తన వీడియోలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.

  సందీప్ నహార్ కెరీర్ ఇలా

  సందీప్ నహార్ కెరీర్ ఇలా

  సందీప్ నహార్ కెరీర్ విషయానికి వస్తే.. ఎంఎస్ ధోని చిత్రం తర్వాత అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రంలో కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పోషించిన భూటాసింగ్ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. 2019లో సోనాక్షి సిన్హా, ర్యాపర్ బాద్షా నటించిన ఖాన్‌దానీ షఫాఖనా చిత్రంలో కూడా నటించారు.

  English summary
  Sushant Singh Rajput's co star Sandeep Nahar's suicide note: Before his death, Sandeep Nahar posted a video in Facebook and revealed that.. fight with wife Kanchan Sharma made him to attempt suicide.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X