twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sushant Singh Rajput Death case: ఎన్సీబీ కస్టడీలో సిద్ధార్థ్.. సుశాంత్ కేసులో కొత్త కోణం.. మర్డర్ కోణంలో సిబీఐ

    |

    గత కొద్దికాలంగా నత్త నడక నడుస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు ఒక్కసారిగా ఊపందుకొన్నది. తాజాగా హైదరాబాద్‌లో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని అరెస్ట్‌ మీడియాలో సంచలనం రేపింది. గుట్టుచప్పుడు కాకుండా సిద్ధార్థ్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేయడం అనేక ఊహాగానాలకు తెర లేపింది. ఈ అరెస్ట్ గురించి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాయర్ వికాస్ సింగ్ పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

    యువ హీరోయిన్ క్లీవేజ్ షో అదుర్స్.. పార్వతీ నాయర్ గ్లామర్ షో

     ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి

    ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి

    గతేడాది సుశాంత్ సింగ్ జూన్ 14వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అనేక సందేహాలకు, అనుమానాలకు దారి తీసింది. సుశాంత్ మరణం సమయంలో ఆ ఇంటిలో ఉన్న సిద్దార్థ్ పితానికి అన్ని విషయాలు తెలిసి ఉంటాయనే ఊహాగానాలు వచ్చాయి. ఈ కేసులో కీలకంగా మారిన సిద్దార్థ్ పితానిని ఈడీ, సీబీఐ, ఎన్సబీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా ముంబైకి చెందిన ఎన్సీబీ అధికారులు ఆయనను అరెస్్ చేసి స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ వారంట్ తీసుకొని మే 28 తేదీన ముంబైకి తరలించారు.

    జూన్ 1 వరకు ఎన్సీబీ కస్టడీలో

    జూన్ 1 వరకు ఎన్సీబీ కస్టడీలో

    సిద్దార్త్ పితానిని అరెస్ట్ చేసి ముంబైకి తరలించిన అనంతరం ఆయనను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. జూన్ 1వ తేదీ వరకు ఎన్సీబీ కస్టడీలోనే ఉండేలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిద్దార్థ్ పితానిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్, 1995 ప్రకారం పలు సెక్షన్లపై కేసు విధించారు. ఈ క్రమంలో సుశాంత్ లాయర్ వికాస్ స్పందిస్తూ.. ఈ కేసులో తగు న్యాయం జరిగింది అంటూ వ్యాఖ్యానించారు.

     సీబీఐ ఆచితూచి దర్యాప్తు

    సీబీఐ ఆచితూచి దర్యాప్తు

    సుశాంత్ కేసులో చార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఈ వ్యవహారంలో తొందరపడకుండా అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఈ కేసును మర్డర్ కేసుగా భావించడానికి ఏవైనా ఆధారాలు, సాక్ష్యాలు లభిస్తాయా అనే విషయాలను పరిశీలిస్తున్నది. సుశాంత్ మరణం విషయం మిస్టరీగా మారింది. మేము ఇప్పుడే ఏ విషయాన్ని వెల్లడించలేం. త్వరలోనే సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని సుశాంత్ లాయర్ వికాస్ సింగ్ పేర్కొన్నారు.

    సిద్దార్థ్ అరెస్ట్ శుభపరిమాణం

    సిద్దార్థ్ అరెస్ట్ శుభపరిమాణం

    వికాస్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ కేసులో మిస్టరీని ఛేదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేమంతా అసలు విషయం బయటకు వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. సిద్ధార్థ్ పితాని అరెస్ట్‌తో చాలా విషయాలపై సందేహాలు తొలగిపోయాయి. అతడిని జైలుకు పంపడం ఈ కేసులో శుభపరిణామం అంటూ అన్నారు.

    Recommended Video

    Actress Payal RajPut ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్!! || Filmibeat Telugu
    సుశాంత్ కేసులో సిద్దార్థ్ పితాని కీలకం

    సుశాంత్ కేసులో సిద్దార్థ్ పితాని కీలకం

    సుశాంత్ కేసులో సిద్దార్థ్ పితానిని అరెస్ట్ చేయాలని ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్నాం. సుశాంత్, రియా చక్రవర్తి మధ్య గొడవలు జరిగినప్పుడు, సుశాంత్ మరణించిన రోజు కూడా అక్కడే ఉన్నాడు. సిద్దార్థ్ రూమ్ తెరిచింది అతడే. తాళాలు పగలకొట్టే వర్కర్‌ను పిలిచింది అతడే. బాడీని కిందకు దించింది అయనే. సుశాంత్‌ను మర్డర్ చేశారా? లేదా ఆత్మహత్యకు ప్రేరేపించారా అనే విషయంలో సిద్దార్థ్‌కు కీలకపాత్ర ఉంది అంటూ లాయర్ వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    English summary
    Sushant Singh Rajput's friend Siddharth Pithani sent to Narcotics Control Bureau (NCB) custody till Jan 1. Pithani was arrested by NCB Mumbai unit on May 28 from Hyderabad. Sushant's family lawyer Vikas Singh called the arrest a poetic justice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X