నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు.. ఇండస్ట్రీ నుంచి గెంటేస్తారు.. సుశాంత్ నాటి సంభాషణ వైరల్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సినీ లోకాన్ని కలవరపర్చింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఇలా అర్దాంతరంగా జీవితాన్ని ముగించడంపై తార లోకం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అయితే బయట సోషల్ మీడియాలో మాత్రం సుశాంత్ ఆత్మహత్యపై భిన్నరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. డిప్రెషన్ కారణంగానే సుశాంత్ మృతి చెందినా దానికి కారణం బాలీవుడ్‌లోని మాఫియా అని, నెపోటిజమే కారణమని కొందరు సెలెబ్రిటీలను వేలెత్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహర్, అలియా భట్, వారసత్వ హీరోలపై నెటిజన్స్ భగ్గుమంటున్నారు.

సుశాంత్ మృతి..

సుశాంత్ మృతి..

సుశాంత్ గత కొంతకాలంగా డిప్రెషన్‌కు లోనవ్వడం, ఈ మధ్య మందులు కూడా వేసుకోకపోవడం, విపరీతంగా ఆందోళనం చెందడం వంటివి చేశాడట. అయితే ఆదివారం ఉదయం బాంద్రాలోని తన నివాసంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా ఓ ప్రతిభావంతుడైన నటుడు అర్దాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడంపై సామాన్య జనం సైతం భావోద్వేగానికి లోనవుతున్నారు.

అదే కారణమని ఫైర్..

అదే కారణమని ఫైర్..

బాలీవుడ్‌లోని కొందరు సెలెబ్రిటీలు, గుత్తాధిపత్యం సాగిస్తున్న వారే సుశాంత్‌కు ఆఫర్స్ రాకుండా చేశారని కామెంట్స్ చేస్తోంది. బాలీవుడ్‌లోని దాదాపు అన్ని ప్రొడక్షన్ కంపెనీలు సుశాంత్‌ను హీరోగా పెట్టుకోరాదని నాడు ఓ వెబ్ సైట్ ప్రచురించిన వార్త తెగ వైరల్ అవుతోంది. కరణ్ జోహర్ వంటి వారే ఇండస్ట్రీని తన గుప్పిట్లో పెట్టుకున్నారని, బయటి వారిని ఎవ్వరినీ ఎదగనివ్వరని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు

నెటిజన్‌కు రిప్లై..

నెటిజన్‌కు రిప్లై..

గతంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు సుశాంత్ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే.. ‘ఓ నో.. ఈ సినిమాలో కూడా మీరు చనిపోతున్నారా?.. ఈ సినిమాను నేను చూడబోను.. ఇక బిగ్ స్క్రీన్‌పై అదే నా చివరి చిత్రం. ఈ ఇండస్ట్రీలో నీ ఒక్కడికే పెద్ద మనసు ఉంది.. మీలాంటి వారు ఎప్పటికీ ఉండాలి' అని పేర్కొన్నాడు.

నన్ను గెంటేస్తారు..

నన్ను గెంటేస్తారు..


నెటిజన్ కామెంట్‌కు సుశాంత్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘అరే.. ఒకవేళ మీరు ఆ సినిమాను చూడకపోతే.. నన్ను బాలీవుడ్ నుంచి గెంటేస్తారు.. నాకెవ్వరూ గాడ్ ఫాదర్ లేరు.. మీ అందర్నీ గాడ్స్, ఫాదర్స్‌గా చేసుకుంటున్నాను. నేను బాలీవుడ్ బతకాలి అంటే మీరు కనీసం ఆ సినిమానైనా చూడాల'ని సుశాంత్ ఇచ్చిన రిప్లై కంటతడి పెట్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X