లాక్‌డౌన్‌లో సహజీవనం కానీ.. 9 గంటల విచారణలో సుశాంత్ ప్రేయసి కీలక సమాచారం, ఫోన్ చెక్ చేస్తే షాకింగ్!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసును వేగవంతంగా విచారణ చేస్తున్న ముంబైలోని బాంద్రా పోలీసులు యువ హీరో ప్రియురాలు రియా చక్రవర్తిని గురువారం సుమారు 9 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు కురిపించిన ప్రశ్నలకు షాకింగ్‌గా కొన్ని సమాధానాలు చెప్పారు. సుశాంత్‌తో తనకు ఉన్న సంబంధాలను బయటపెడుతూ...
Recommended Video

రియా చక్రవర్తిని సుదీర్ఘంగా
రియా చక్రవర్తిని విచారించిన సమయంలో పోలీసులు చాలా క్షుణ్ణంగా ఆమె ఫోన్‌ను పరిశీలించారు. ఆ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను స్కాన్ చేశారు. వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను, వారి మధ్య జరిగిన ఎస్సెమ్మెస్ ఛాటింగ్, వాట్సప్ ఛాటింగ్‌ను కూడా చూశారు. కొన్ని ఫోటోలు, వీడియోల గురించి అడిగి తెలుసుకొన్నామని మీడియా వెల్లడించారు.

2020 పెళ్లి చేసుకోవాలనుకొన్నాం..
సుశాంత్‌తో ఉన్న రిలేషన్‌షిప్ గురించి రియా చెబుతూ.. మా మధ్య చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. త్వరలోనే అంటే 2020లోనే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకొన్నాం. అందుకోసం ఇళ్లును వెతుకుతున్నామని మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త కూడా నిజమే అని రియా చక్రవర్తి చెప్పారు.

లాక్‌డౌన్‌లో సహజీవనం
లాక్‌డౌన్ సమయంలో మేమిద్దరం సుశాంత్ సింగ్ ఫ్లాట్‌లోనే ఉన్నాం. దాదాపు మూడు నెలలు కలిసి సహజీవనం చేశాం. ఆ తర్వాత మా మధ్య గొడవ జరిగింది. దాంతో నేను అతడి ఫ్లాట్ నుంచి బయటకు వచ్చాను. అప్పటి నుంచి మేము కలుసుకోలేదు. కానీ ఫోన్‌లో టచ్‌లో ఉన్నాం. వాట్సప్‌లో మెసేజ్ షేర్ చేసుకొన్నామని రియా పోలీసులకు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిసింది.

డిప్రెషన్‌కు మెడిసిన్స్ వాడారు...
సుశాంత్ డిప్రెషన్‌కు గురయ్యారనే విషయం నిజమే. ఆయన అందుకు ట్రీట్‌మెంట్ తీసుకొన్నారు అలాగే మెడిసిన్స్ కొన్నాళ్లు వాడిన తర్వాత మానేశారు. ఇప్పుడు యోగా, మెడిటేషన్‌పై మాత్రమే దృష్టి పెట్టారు. మెడిసిన్స్ తీసుకోవాలని సుశాంత్‌పై ఒత్తిడి తెచ్చినా గానీ అందుకు సిద్ధం కాలేదు అని రియా చెప్పినట్టు తెలిసింది.

ఆర్థిక ఇబ్బందులు లేవు...
కొన్ని ప్రాజెక్టులు చేతి నుంచి చేజారినా గానీ సుశాంత్‌కు ఆర్థికంగా ఇబ్బంది కలుగులేదు. ఆయన ఒకట్రెండు ప్రాజెక్టులతో బిజీగానే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు ఆయన డేట్స్ ఖాళీలేవు. నా చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. ప్రస్తుతం నేను ఖాళీగానే ఉన్నాను అని పోలీసుల ప్రశ్నలకు రియా జవాబు ఇచ్చినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











